ETV Bharat / offbeat

ఇంట్లో క్యాలీఫ్లవర్ ఎవరూ తినట్లేదా? - ఇలా ఫ్రై చేస్తే మొత్తం ఖాళీ చేస్తారు!

- అద్దిరిపోయే క్యాలీఫ్లవర్​ వేపుడు - ఈ టిప్స్ పాటిస్తే రుచి అద్భుతం

How to Make Cauliflower Fry Recipe
How to Make Cauliflower Fry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 24 hours ago

How to Make Cauliflower Fry Recipe : పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయల్లో క్యాలీఫ్లవర్ కూడా ఒకటి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దీనిని కొందరు తినడానికి అంతగా ఇష్టపడరు. మీ ఇంట్లో కూడా క్యాలీఫ్లవర్​ కర్రీ తినడానికి ముఖం తిప్పుకుంటున్నారా ? అయితే, ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా "క్యాలీఫ్లవర్​ ఫ్రై" ట్రై చేయండి. ఇష్టపడని వారు కూడా తింటారు. ఈ క్యాలీఫ్లవర్​ వేపుడు అన్నం, చపాతీల్లో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఇక లేట్​ చేయకుండా సింపుల్​గా ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్​ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఏంటో మీరు చూడండి..

కావాల్సిన పదార్థాలు..

  • క్యాలీఫ్లవర్​-400 గ్రాములు
  • ఉల్లిపాయ-1
  • పచ్చిమిర్చి-3
  • పసుపు-పావు టీస్పూన్​
  • నూనె
  • ఉప్పు-రుచికి సరిపడా
  • కారంపొడి-ఒకటిన్నర టీస్పూన్లు
  • జీలకర్ర-అరటీస్పూన్
  • ధనియాలు-టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు-6
  • నువ్వులు-2 టేబుల్​స్పూన్లు
  • కరివేపాకు-1

తయారీ విధానం :

  • ముందుగా క్యాలీఫ్లవర్​ శుభ్రం చేసుకుని కాస్త పెద్ద ముక్కలుగా కట్​ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్​ చేయాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టండి. ఇందులో 3 గ్లాసుల నీరు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా మరిగించండి.
  • నీరు బాగా మరుగుతున్నప్పుడు స్టౌ ఆఫ్​ చేసి.. క్యాలీఫ్లవర్​ ముక్కలు వేయండి.
  • వీటిని 10 నిమిషాలు అలా వదిలేసి.. ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అలాగే మిక్సీ గిన్నెలోకి కారం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక సగం ఉడికించున్న క్యాలీఫ్లవర్​ ముక్కలు వేయండి. క్యాలీ ఫ్లవర్​ ముక్కలను మధ్యమధ్యలో కలుపుతూ.. దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి.
  • తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అదే నూనె ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించుకోండి. తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి.
  • ఉల్లిపాయలు గోల్డెన్​ కలర్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి కలపండి.
  • ఆపై ఆయిల్లో ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలపండి.
  • 2 నిమిషాల తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన కారంపొడి మిశ్రమం వేసి కలపండి.
  • ఒక నిమిషం తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్​ వేపుడు మీ ముందుంటుంది.

ఇవి కూడా చదవండి :

మళ్లీ మళ్లీ తినాలనిపించే నార్త్​ ఇండియా రెసిపీ - "దహీ ఆలూ కర్రీ"ని ఇలా ప్రిపేర్ చేయండి!

అప్పటికప్పుడు చేసుకునే "ఇన్​స్టంట్ పల్లీ చట్నీ" - అన్ని టిఫెన్స్​లోకి సూపర్ కాంబో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.