ETV Bharat / technology

BMW కొత్త అడ్వెంచర్ బైక్ చూశారా?- బాక్సీ డిజైన్​లో భలే ఉందిగా!- ధర ఎంతంటే? - BMW R 1300 GS ADVENTURE LAUNCHED

BMW R 1300 GS అడ్వెంచర్ మోటార్​సైకిల్ లాంఛ్- ధర, ఫీచర్ల వివరాలివే!

2025 BMW R 1300 GS Adventure
2025 BMW R 1300 GS Adventure (Photo Credit- BMW Motorrad)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 20, 2025, 7:14 PM IST

BMW R 1300 GS Adventure Launched: ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ BMW మోటోరాడ్ తన 'BMW R 1300 GS అడ్వెంచర్' మోటార్‌సైకిల్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 22.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ బైక్ పొజిషన్ BMW R 1300 GS పైన ఉంటుంది.

BMW R 1300 GS అడ్వెంచర్ డిజైన్: ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ దాని స్టాండర్డ్ ప్రీవియస్ మోడల్స్​ కంటే భిన్నంగా పర్పస్​ఫుల్ డిజైన్​తో వస్తుంది. ఈ బైక్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. దీని లోపల 30-లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్​ను చక్కగా అమర్చారు.

ఈ బైక్ స్క్వేర్ ఎడ్జెస్ దీనికి ఒక ప్రత్యేకమైన స్టైలింగ్​ను ఇస్తాయి. హెడ్​లైట్ కింద ఉన్న బీక్, ఫ్యూయెల్ ట్యాంక్, టెయిల్ సెక్షన్​ అన్నీ స్క్వేర్ డిజైన్​ను కలిగి ఉంటాయి. ఇది R 1300 GS కంటే రోడ్డుపై చాలా ఎక్కువ ప్రెసెన్స్​ను చూపుతుంది.

BMW R 1300 GS అడ్వెంచర్ ఇంజిన్: ఈ కొత్త BMW R 1300 GS అడ్వెంచర్​లో 1,300cc, బాక్సర్ ట్విన్ ఇంజిన్‌ అందించారు. ఇది 7,750rpm వద్ద 145bhp పవర్, 6,500rpm వద్ద 149Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

రైడింగ్ మోడ్స్: పవర్ డెలివరీని కంట్రోల్ చేసేందుకు, ట్రాక్షన్ కంట్రోల్ ఇంటర్వెన్షన్ లెవెల్స్​ను ఎడ్జిస్ట్ చేసేందుకు ఈ మోటార్ సైకిల్ నాలుగు రైడ్ మోడ్స్​తో వస్తుంది.

  • ఎకో
  • రెయిన్
  • రోడ్
  • ఎండ్యూరో

BMW మోటోరాడ్ R 1300 GS మోటార్​సైకిల్​లో స్టాండర్డ్​ ఎక్విప్మెంట్​గా చాలానే​ ఫీచర్లను అందించింది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త BMW R 1300 GS అడ్వెంచర్​ బైక్​లో AUX లైట్స్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, రాడార్ బేస్డ్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కొలిషన్ వార్నింగ్ వంటి వాటితో పాటు ఫుల్ LED లైట్లను అమర్చింది.

BMW R 1300 GS అడ్వెంచర్ హార్డ్‌వేర్: ఈ కొత్త బైక్ హార్డ్‌వేర్ విషయానికొస్తే ఇందులో షీట్ మెటల్ మెయిన్ ఫ్రేమ్, అల్యూమినియం లాటిస్ ట్యూబ్ రియర్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది BMWకు చెందిన టెలిలివర్ అండ్ పారాలెవర్ EVO సస్పెన్షన్ యూనిట్లను ఉపయోగిస్తుంది. దీని సస్పెన్షన్​ను ఎలక్ట్రానిక్‌గా ఎడ్జిస్ట్ చేయొచ్చు. డైనమిక్ సస్పెన్షన్ అడ్జస్ట్‌మెంట్ లేదా DSA స్టాండర్డ్​గా వస్తుంది.

వేరియంట్లు: కంపెనీ ఈ కొత్త BMW R 1300 GS అడ్వెంచర్‌ను మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది

  • బేసిక్
  • ట్రిపుల్ బ్లాక్
  • GS ట్రోఫీ
  • ఆప్షన్ 719 కారకోరం

మార్కెట్లో దీని ప్రత్యర్థులు: భారత మార్కెట్లో ఈ మోటార్​సైకిల్ డుకాటి మల్టీస్ట్రాడా V4 ర్యాలీతో పోటీపడుతుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్​లో స్లిమ్ మోడల్​!- ఈ స్పెషల్ ఎడిషన్ ధర ఎంతంటే?

2025 సుజుకి యాక్సెస్ కెవ్వు కేక!- మిడిల్​ క్లాస్ మెచ్చే స్కూటర్ అంటే ఇదే!

భారత మార్కెట్లోకి MG ZS HEV!- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.