ETV Bharat / sports

WTC ఫైనల్ రేస్: ఆసీస్​ సిరీస్ 2-2తో డ్రా అయినా భారత్ ఫైనల్ బెర్త్ పక్కా!- కానీ

మారిన డబ్ల్యూటీసీ లెక్కలు- ఫైనల్ చేరాలంటే టీమ్ఇండియా సమీకరణాలు ఇవే!

WTC Final Scenario
WTC Final Scenario (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

WTC Final Scenario : 2025 వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. తాజాగా శ్రీలంకపై భారీ విజయంతో సౌతాఫ్రికా రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 61.10 పాయింట్ శాతంతో భారత్ టాప్​లో ఉండగా, సౌతాఫ్రికా 59.260, ఆస్ట్రేలియా 57.690తో వరుసగా రెండు, మూడు ప్లేస్​ల్లో కొనసాగుతున్నాయి. దీంతో టాప్ 2 స్థానాల కోసం భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఇక వరుసగా మూడోసారి ఫైనల్ బెర్త్​పై టీమ్ఇండియా కన్నేసింది. ఇటీవల స్వదేశంలో కివీస్​తో 3-0తో ఓడినా, ఆసీస్ గడ్డపై విజయంతో సిరీస్ ప్రారంభించి ఆశలు నిలుపుకుంది. అయితే శ్రీలంకపై సౌతాఫ్రికా విజయం సాధించడం వల్ల టీమ్ఇండియా ఫైనల్ సమీకరణాలు మారాయి. బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీని భారత్ 5-0, 4-1, 4-0 లేదా 3-0తో కైవసం చేసుకుంటే నేరుగా ఫైనల్​కు అర్హత సాధిస్తుంది. ఈ నాలుగు సమీకరణాల్లో భారత్ ఏ ఒక్క తేడాతోనైన సిరీస్ గెలుచుకోగలితే ఫైనల్ చేరుకోవడం పక్కా. ఇలా కాకుండా కింద పేర్కొన్న విధంగానూ భారత్ ఫైనల్ చేరుకోవచ్చు!

  1. భారత్ 3- 1తో గెలిస్తే : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ని భారత్ 3- 1తో నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. కానీ, శ్రీలంకతో జరిగే రెండో టెస్టులో సౌతాఫ్రికా ఓడిపోవాలి. ఒకవేళ ఆ మ్యాచ్‌ డ్రా అయినా కూడా ఆసీస్‌పై భారత్‌ 3-1తో గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది.
  2. భారత్ 3- 2తో గెలిస్తే : ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా 3- 2తో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ, సౌతాఫ్రికాతో జరనున్న రెండో టెస్టులో శ్రీలంక నెగ్గాలి. అలాగే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్​లో ఒకటి డ్రా చేసుకోవాలి. ఈ సిరీస్‌ జనవరి 29 నుంచి శ్రీలంక వేదికగా మొదలవనుంది.
  3. 2 - 2తో డ్రా అయిన సరే : ఆసీస్​తో ఐదు మ్యాచ్​ల సిరీస్ 2-2తో డ్రా అయినా భారత్‌ వరల్డ్​టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరడానికి ఛాన్స్​లు ఉంటాయి. అయితే ఇతర సిరీస్​ల్లో ఫలితాలు మనకు అనుగునంగా రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకోవాలి. దీంతోపాటు ఆస్ట్రేలియాతో జరిగే 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక కనీసం 1-0తో దక్కించుకోవాలి. అలా జరిగితేనే బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ 2- 2తో డ్రా చేసుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.

పాయింట్స్ పట్టికలో రెండో స్థానానికి ఢమాల్ - WTC ఫైనల్స్​కు టీమ్ఇండియా చేరేనా?

కివీస్​తో సిరీస్ ఓటమి- భారత్​ WTC ఫైనల్​ ఛాన్స్​లు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.