Best Mileage Car Under 7 Lakh: మీరు తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. రూ.7 లక్షల బడ్జెట్లోని ఈ టాప్-5 కార్లపై ఓ లుక్కేద్దాం రండి.
1. Maruti Suzuki Swift : మారుతి సుజికి స్విఫ్ట్ కారు 5 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారులో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంది. 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. మార్కెట్లో ఈ మారుతి స్విఫ్ట్ కారు ధర రూ.6.49 నుంచి ప్రారంభమవుతుంది.
- ఇంజిన్ : 1197 సీసీ
- పవర్ : 68.8 - 80.46 bhp
- టార్క్ : 101.8 - 111.7 Nm
- ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 24.8 - 25.75 కి.మీ/లీటర్
- ఫ్యూయెల్ : పెట్రోల్ / సీఎన్‌జీ
2. Tata Tiago : టాటా టియాగో కారు 27 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ టాటా టియాగో కారు ధర సుమారుగా రూ.4.99 లక్షల(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతుంది.
- ఇంజిన్ : 1199 సీసీ
- పవర్ : 72.41 - 84.48 bhp
- టార్క్ : 95 - 113 Nm
- ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 19 - 20.09 కి.మీ/లీటర్
- ఫ్యూయెల్ : సీఎన్‌జీ/పెట్రోల్
3. Renault Kwid : రెనో క్విడ్ కారు 6 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. మార్కెట్లో ఈ రెనో క్విడ్ కారు ధర సుమారుగా రూ.4.70 లక్షలు - రూ.6.45 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
- ఇంజిన్ : 999 సీసీ
- పవర్ : 67.06 bhp
- టార్క్ : 91 Nm
- ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 21.46 - 22.3 కి.మీ/లీటర్
- ఫ్యూయెల్ : పెట్రోల్
4. Maruti Suzuki Wagon R : మారుతి సుజుకి వేగన్ఆర్ కారు 4 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.33 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉంది.
- ఇంజిన్ : 998 - 1197 సీసీ
- పవర్ : 55.92 - 88.5 bhp
- టార్క్ : 82.1 - 113Nm
- ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 23.56 - 25.19 కి.మీ/లీటర్
- ఫ్యూయెల్ : సీఎన్‌జీ/పెట్రోల్
5. Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్టర్ కారు 12 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. మార్కెట్లో ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ కారు ధర సుమారుగా రూ.6.13 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతుంది.
- ఇంజిన్ : 1197 సీసీ
- పవర్ : 67.72 - 81.8 bhp
- టార్క్ : 95.2 - 113.8 Nm
- ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 19.2 - 19.4 కి.మీ/లీటర్
సేఫ్టీ మీ ఫస్ట్ ప్రయారిటీనా? 5-స్టార్ రేటింగ్ ఉన్న ఈ టాప్-5 కార్స్‌పై ఓ లుక్కేయండి!
న్యూ ఇయర్‌లో మంచి 7-సీటర్ కార్ కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్-6 మోడల్స్ ఇవే!