ETV Bharat / state

71 టు 51 - 'మై జర్నీ ఫ్రమ్‌ ఫెయిల్యూర్‌ టు ఐఏఎస్‌' -

71 టు 51 'మై జర్నీ ఫ్రమ్​ ఫెయిల్యూర్​ టు ఐఏఎస్​' పేరుతో బుక్​ రాసిన మహిళా కలెక్టర్​ - అమెజాన్​ ట్రెండింగ్​ బుక్స్​లో ఒకటిగా నిలిచిన పుస్తకం

Inspirational Story Of IAS Officer Ila Tripathi
Inspirational Story Of IAS Officer Ila Tripathi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Inspirational Story Of IAS Officer Ila Tripathi : ఇలా త్రిపాఠి ప్రస్తుత నల్గొండ జిల్లా కలెక్టర్​గా ఉన్నారు. యూపీఎస్​సీ సివిల్స్‌ మొదటి ప్రయత్నంలో 71 మార్కులతో ప్రిలిమ్స్‌నూ దాటలేకపోయారు. సీన్‌కట్‌ చేస్తే రెండో ప్రయత్నంలో 1054 మార్కులతో దేశంలోనే 51వ ర్యాంకును సాధించారు. మరి మొదటిసారి చేసిన తప్పులేంటి? రెండో ప్రయత్నంలోనే వాటిని ఎలా అధిగమించి ఏకంగా ఆలిండియా 51వ ర్యాంక్​ను సాధించారు? ఇదంతా తెలుసుకోవాలంటే ఆవిడ రాసిన 71 టు 51- 'మై జర్నీ ఫ్రమ్‌ ఫెయిల్యూర్‌ టు ఐఏఎస్‌’ పుస్తకాన్ని చదవాల్సిందే. ప్రస్తుతం అమెజాన్‌ ట్రెండింగ్‌ బుక్స్​లో ఇదీ ఒకటి. ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

సివిల్స్​ ప్రిపరేషన్​కు తొలిబీజం అక్కడే పడింది : చిన్నప్పుడు నాన్నను ఓ ప్రశ్న అడిగేదాన్ని. ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతూ సేవ చేసేందుకు అవకాశముండే పని ఏంటో చెప్పమని. దానికి నాన్న ఇచ్చిన సమాధానం కలెక్టర్‌ ఉద్యోగం అని. ఆ విధంగా అది అలా మనసులో నాటుకుపోయింది. నేను సివిల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు తొలిబీజం అక్కడే పడింది. మా స్వస్థలం(పుట్టిన ఊరు) లఖ్‌నవూలోని అలీగంజ్‌. నాన్న పీఎన్‌ త్రిపాఠీ ఐఎఫ్ఎస్(ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌) అధికారి. అమ్మ గిరిజ త్రిపాఠీ ప్రైవేట్‌ టీచర్​గా పనిచేస్తుండేది. సోదరి వినీత. 2013లో దిల్లీలో ఇంజినీరింగ్‌ విద్యను పూర్తిచేశా. ఆ తరవాత లండన్‌లో ఎకనామిక్స్ విద్యను పూర్తి చేసి అక్కడే రెండున్నర ఏళ్లు పాటు ఫైనాన్స్‌ కన్సల్టెంట్‌గానూ పనిచేశా. జాబ్​ చేస్తున్నా కానీ, నాలో ఏదో అసంతృప్తి. అనుకున్నది చేయలేకపోతున్నానే ఆలోచన ఉండేది. అందుకే, మనసుమాట విన్నాను.

సివిల్స్​లో జాతీయ స్థాయిలో 51వ ర్యాంకు : జాబ్​ను వదిలేసి 2015లో సివిల్స్​కు ప్రిపరేషన్​ మొదలుపెట్టా. కానీ, నా స్ఫూర్తినింపిన నాన్న గుండెపోటు కారణంగా 2011లోనే మా కుటుంబానికి దూరమయ్యారు. ఇక అమ్మ నాకోసం తను చేస్తున్న ఉద్యోగాన్నీ వదిలేసి, నా సన్నద్ధతకు సాయపడడం మొదలుపెట్టింది. ఆ విధంగా 2016లో సివిల్స్‌ పరీక్షను తొలిసారిగా రాశా. కానీ, ప్రిలిమ్స్‌ మాత్రం సాధించలేకపోయా. అయినా తిరిగి 2017లో రెండోసారి మళ్లీ ప్రయత్నించా. ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో 51వ ర్యాంకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఉన్న ఎల్​బీఎస్​ఎన్​ఏఏ(‘లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌)’లో బ్యూరోక్రసీ పాఠాలను నేర్చుకున్నా. మొదట ట్రైనీ ఐఏఎస్​ అధికారిగా భద్రాద్రి కొత్తగూడెంలో విధులు నిర్వర్తించాను. ఆ తరవాత మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్​గా, ములుగు జిల్లా కలెక్టర్‌గా, హైదరాబాద్‌లో పర్యటకశాఖ సంచాలకురాలిగానూ విధులు నిర్వర్తించాను.

ఎజెన్సీ ప్రాంతాల్లో పిల్లలకు పోషకాహారం : నా భర్త భవేశ్‌మిశ్రా. ఆయన ప్రస్తుతం రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఉప కార్యదర్శిగా విధులను నిర్వహిస్తున్నారు. నా కంటే రెండు సంవత్సరాల సీనియర్‌. బిహార్‌లోని బాగల్‌పూర్‌లో పనిచేస్తున్నప్పుడు ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. సివిల్స్‌కి ప్రిపేర్​ అయ్యే క్రమంలో ఆయన సలహాలు, సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నేను అడిషనల్​ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ హాస్పిటల్​లోనే మా బాబుకి జన్మనిచ్చా. ఇక ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు తీవ్రమైన పోషకాహార లోపంతో ఉండడం చూసి చాలా బాధేసింది. అందుకే, నా బిడ్డకు ఎలాంటి పోషకాహారం అందిస్తున్నానో అక్కడి పిల్లలకు కూడా అలాంటి ఆహారాన్నే అందించాలనుకున్నా. బాలింతలు, గర్భిణులకోసం 13 రకాల చిరుధాన్యాలతో కూడిన పోషణ్‌ పోట్లీ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చు.

ఆయన్ని చూసి ఐఏఎస్​ అవ్వాలనుకున్నా : నా చిన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌లో అభిషేక్‌ప్రకాశ్‌ అనే సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్​ ఒకరు ఉండేవారు. ఆయన ఎక్కువగా అంబాసిడర్‌ కారులోనే ప్రయాణించేవారు. ఆయన వస్త్రధారణ, హుందాతనం, వెనకాల వచ్చే కార్ల వరస ఇవన్నీ చూసి అక్కడి గ్రామస్థులు ఆయన్ని చాలా ఆరాధించేవారు. అతని హోదా ఏంటో తెలియక అక్కడివారందరూ అంబాసిడర్‌ వాలీ నౌకరీ’ అని పిలిచేవారు. తమ పిల్లలు కూడా అలాంటి ఉద్యోగాన్నే చేయాలని కలలు కనేవారు. ఆయన్ని చూసి నాకు కూడా ఐఏఎస్‌ అధికారి అవ్వాలనే ఆశ మరింత బలపడింది. కష్టపడి ఆ కలను నెరవేర్చుకున్నా. యూపీఎస్సీ ఫలితాలు వచ్చాక లఖ్‌నవూ కా టాపర్‌’ అని స్థానిక వార్తాపత్రికలో నా కథ ప్రచురితమవడం అమితానందాన్ని ఇచ్చింది.

'71టు51- మై జర్నీ ఫ్రమ్‌ ఫెయిల్యూర్‌ టు ఐఏఎస్‌’ : నాలా ఐఏఎస్​ అవ్వాలని కలలు కనేవాళ్లు ఎందరో ఉంటారు కదా! అలాంటి వాళ్లతో నా అనుభవాలను పంచుకోవాలనుకున్నా. అందుకే, నా ఈ సివిల్స్‌ జర్నీని( ప్రయాణాన్ని) ‘71టు51- మై జర్నీ ఫ్రమ్‌ ఫెయిల్యూర్‌ టు ఐఏఎస్‌’ పేరుతో పుస్తకరూపంలోకి తీసుకొచ్చా. ఆ పుస్తకంలో జనరల్‌ స్టడీస్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, మేనేజ్‌మెంట్‌ స్కిల్స్, మాక్‌టెస్ట్‌ల సాధన, సమకాలీన అంశాలపై లోతైన విశ్లేషణలను పొందుపరిచాను. ఇప్పుడు ఈ పుస్తకానికి విశేష ఆదరణ దక్కుతోంది. ఒక్క పుస్తకమనే కాదు సోషల్​ మీడియా ద్వారానూ అడిగిన వారికి నా సూచనలు అందిస్తుంటా. నా అనుభవాలు అనేవి కొందరికైనా ఉపయోగపడాలన్నదే నా తాపత్రయం. నా వల్లకాదు, నేను చేయలేను అనుకుంటే ఏమీ సాధించలేం. ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకునేవాళ్లు ఎప్పటికైనా విజయం సాధిస్తారు.

25ఏళ్ల క్రితం చెత్తకుప్పలో దొరికిన అంధురాలు- ఇప్పుడు అందరికీ ఆదర్శం- టార్గెట్ IAS - Blind Girl Success Story

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో మెరిసిన తెలుగుతేజం - తొలి ప్రయత్నంలోనే మూడోర్యాంకుతో ఐఏఎస్ సాధించిన అనన్య - UPSC Third Ranker Ananya Interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.