గజరాజుల పరుగు పందెం.. భారీగా తరలివచ్చిన జనం
🎬 Watch Now: Feature Video
అసోం రాష్ట్ర నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వారి సంప్రదాయ ఉత్సవమైన రంగాలి బిహూ(ఏప్రిల్ 15) సందర్భంగా శివసాగర్ ప్రాంతంలో ఏనుగులతో పరుగు పందెం నిర్వహించారు. ముందుగా ఏనుగులకు పూజలు నిర్వహించి, పరుగు పందెంలోకి దింపారు. ఏనుగులపై మావటి కూర్చుని వాటిని పరుగులు పెట్టించారు. ఈ పందెంలో విజయం సాధించిన ఏనుగు యజమానికి నిర్వాహకులు బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. ఏనుగుల పరుగు పందెం చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST