Check Your FASTag Balance Properly : సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఒకసారి తమ వాహనం ఫాస్టాగ్‌ను సరి చూసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సూచనలు చేస్తున్నారు. కేవైసీ చేయించక, మినిమం బ్యాలెన్స్ లేక బ్లాక్ లిస్టులో పడిపోతున్నాయని అధికారులు అంటున్నారు. అసలే సంక్రాంతి టైంలో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ సాధారణ రోజుల్లో కంటే అధికంగా ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతాయి. మీ వాహనం ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకపోయినా, బ్లాక్ లిస్టులో పడిపోయినా, టోల్ ప్లాజా నుంచి ముందుకు వెళ్లలేరు. అలాగని వెనక్కీ వెళ్లలేరు. దీంతో మీరే కాకుండా తోటి ప్రయాణికులూ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
FASTag Balance Check Number : ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కారు ఫాస్టాగ్‌ను సరి చూసుకొని ప్రయాణం చేయడం మంచిదని ఎన్‌హెచ్‌ఏఐ పీడీ నాగేశ్వర్ రావు వివరించారు. మరోవైపు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నా, ఇతర అత్యవసర వేళల్లోనూ 1033 నంబరుకు ఫోన్ చేస్తే సంబంధిత సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సాయం చేస్తారని అన్నారు. విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్, పంతంగి, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. పంతంగి వద్ద రోజూ సగటున 37 వేల వాహనాలు వెళ్తుండగా, వీటిలో సుమారు 100 వాహనాలు బ్లాక్ లిస్టులో పడినవే ఉంటున్నాయి. సంక్రాంతి పండుగ టైంలో ఇంకా రెట్టింపు సంఖ్యలో ఇలాంటి వాహనాలు ఉండే అవకాశముంది. కొందరు వాహనదారులు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాక రీఛార్జ్ చేస్తుంటారు. యాక్టివేషన్ కావడానికి 15 నిమిషాలకు పైగా టైం పడుతుంది. అందుకే ఇంటి నుంచి బయలుదేరే టైంలోనే ఫాస్టాగ్‌లో నగదు సరి చూసుకుంటే మంచిదని అధికారులు అంటున్నారు.
3 సెకన్లలో ఫాస్టాగ్ స్కానింగ్ : టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకు వచ్చి ఫాస్టాగ్‌ను స్కాన్ చేసేలా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద 4 హ్యాండ్ మిషన్లు, ఒక స్టిక్ మిషన్‌ను అందుబాటులో ఉంచారు. వాహనం ఫాస్టాగ్ స్కానింగ్ 3 సెకన్ల సమయంలో జరిగిపోతుంది.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - 'మాకు చెప్పండి - మీ ఇంటికి మేం కాపలా కాస్తాం'
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - తక్కువ ధర టిక్కెట్టుతో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు!
సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త - ఆ మార్గాల్లో అదనంగా 1030 బస్సులు