గౌతమేశ్వరస్వామి ఆలయానికి కార్తిక శోభ.. - karthika pournami celebrations in manthani
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వర స్వామి ఆలయంలో కార్తిక దీపాలు వెలిగించారు.

గౌతమేశ్వరస్వామి ఆలయానికి కార్తిక శోభ
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం కార్తిక శోభతో వెలుగులీనుతోంది. తెల్లవారుజాము నుంచే పట్టణం నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా.. గోదావరి నది వద్దకు తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, నది ఒడ్డున ఉన్న ఉసిరి చెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు.
అనంతరం గౌతమేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక దీపాల వెలుగులతో పట్టణంలోని శివాలయాన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
- ఇదీ చూడండి : పదో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు