కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్’ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌రెడ్డి(revanth reddy) నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దిల్‌సుఖ్ నగర్ వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకపోవడంతో రేవంత్ పోలీసులపై మండిపడ్డారు. కార్యకర్తలు, నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి ఇంటి ముందే బైఠాయించారు. గాంధీ జయంతి రోజున పోలీసులు తన ఇంటిపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలీకి(congress rally) అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎల్‌బీ నగర్‌లో విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌కు వచ్చిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో ముందస్తుగా దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు.. మెట్రో స్టేషన్ వద్ద దుకాణాలు మూసివేయించారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ చేపడతానని రేవంత్ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికారులు.. దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. దిల్‌సుఖ్‌నగర్ కూడలికి వస్తున్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. రేవంత్ ర్యాలీ నిర్వహించకుండా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లో హై అలర్ట్... దుకాణాలు మూసివేయిస్తున్న పోలీసులు