ETV Bharat / technology

వారెవ్వా.. రోల్స్ రాయిస్ కొత్త కారు ఏం ఉంది భయ్యా!- ఒక్క చూపుకే ఫిదా అయిపోవడం ఖాయం! - ROLLS ROYCE GHOST FACELIFT LAUNCHED

భారత్​లో రోల్స్ రాయిస్ కారు లాంఛ్- ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

Rolls Royce Series II
Rolls Royce Series II (Photo Credit- Rolls Royce)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 30, 2024, 6:05 PM IST

Rolls Royce Ghost Facelift Launched: లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారత మార్కెట్‌లో కొత్త 'ఘోస్ట్ సిరీస్ II'ని విడుదల చేసింది. కంపెనీ ఈ సిరీస్​లో రోల్స్​ రాయిస్ ఘోస్ట్ ఫేస్​లిఫ్ట్​ను లాంఛ్ చేసింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రోల్స్​ రాయిస్.. ఈ ఘోస్ట్ సిరీస్ IIను అక్టోబర్, 2024​లో గ్లోబల్​గా పరిచయం చేసింది. ఇప్పుడు ఎట్టకేలకూ ఈ లగ్జరీ సెడాన్​ అదిరే అప్​డేట్లతో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

వేరియంట్స్: కంపెనీ ఈ కారును మూడు విభన్న వేరియంట్లలో తీసుకొచ్చింది.

  • స్టాండర్డ్
  • ఎక్స్‌టెండెడ్
  • బ్లాక్ బ్యాడ్జ్

కంపెనీ ఈ లగ్జరీ సెడాన్‌ను బుకింగ్స్​ను ఇప్పటికే ప్రారంభించింది. దీని డెలివరీలు మాత్రం 2025 ఫస్ట్ క్వార్టర్​లో ప్రారంభంకానున్నాయి. ఈ సెడాన్​ను రీడిజైన్ చేసి ఘోస్ట్ సిరీస్ IIలో కొత్త ఎక్స్​టీరియర్​ కలర్​ను పరిచయం చేశారు. దీన్ని మస్టిక్ బ్లూ రంగులో తీసుకొచ్చారు.

ఇది కొత్త ట్రాపెజోయిడల్- షేప్​లో హెడ్‌ల్యాంప్‌లు, అప్‌డేట్ చేసిన DRL యూనిట్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, కొద్దిగా రీషేప్ చేసిన ఎయిర్​ ఇన్​టెక్స్​తో వస్తుంది. దీని టెయిల్ ల్యాప్స్​ డిజైన్​ మాత్రం అలాగే ఉంచారు. కానీ అవి న్యూ ప్యాటెర్న్​తో వస్తాయి. వీటితో పాటు ఈ కొత్త ఘోస్ట్ ఇప్పుడు 9-స్పోక్ డిజైన్​తో రెండు కొత్త 22-అంగుళాల వీల్స్ ఆప్షన్​తో వస్తుంది.

ఇంటీరియర్: ఈ కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్ దాని పాత మోడల్ మాదిరిగానే స్టన్నింగ్ డ్యాష్​బోర్డ్ డిజైన్​ను కలిగి ఉంది. కంపెనీ దీనికి అట్రాక్టివ్ ఫుల్-లెన్త్ గ్లాస్ ప్యానెల్​ను కూడా జోడించింది. ఇది రోల్స్ రాయిస్ వినూత్న 'స్పిరిట్' ఆపరేటింగ్ సిస్టమ్‌ను హైలైట్ చేస్తుంది. అంతేకాక ఎక్స్​టెన్సివ్ కస్టమైజేషన్​ ఆప్షన్లకు పేరొందిన ఈ ఘోస్ట్ సిరీస్ ఇప్పుడు గ్రే-స్టెయిన్డ్ యాష్ అండ్ ఇంట్రికేట్ డ్యూయలిటీ ట్విల్ వంటి వైడర్ రేంజ్ మెటీరియల్స్​తో వస్తుంది.

వీటితో పాటు ఘోస్ట్ సిరీస్ II 'ప్లేస్డ్ పెర్ఫరేషన్' అనే ఓ యునిక్ అప్హోల్స్టరీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సీట్లలో 107,000 రంధ్రాలను కలిగి ఉంటుంది. రోల్స్ రాయిస్ గుడ్‌వుడ్ హెడ్​ క్వార్టర్​పై ఉన్న క్లౌడ్ ఫార్మేషన్‌లను అనుకరించేలా జాగ్రత్తగా ఈ చిల్లులను ఏర్పాటు చేశారు. వెనుక సీటులో కూర్చున్నవారి ఎక్స్​పీరియన్స్​ను మెరుగుపర్చేందుకు, ప్రయాణీకులు ఇప్పుడు ఎంటర్నైన్మెంట్​ కోసం వారి సంబంధిత స్క్రీన్‌లపై రెండు స్ట్రీమింగ్ డివైజ్​లను కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇతర మెయిన్ ఫీచర్లు: ఈ సెడాన్‌లో వైర్‌లెస్ హెడ్‌ఫోన్ కనెక్టివిటీ, సెంటర్ కన్సోల్‌లో ఉన్న USB-C పోర్ట్, మరింత శక్తివంతమైన 1,400W యాంప్లిఫైయర్ వంటివి ఉన్నాయి.

పవర్​ట్రెయిన్: రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్​లిఫ్ట్​లో అదే పాత 6.75-లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజిన్​ను అమర్చారు. ఇది 8-స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఎక్స్‌టెండెడ్ ఎడిషన్లలో 555bhp పవర్, 850Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్​లో మాత్రం 584bhp పవర్, 900Nm టార్క్​ను అందిస్తుంది.

ధరలు:

  • స్టాండర్డ్ వేరియంట్ ధర: రూ.8.95 కోట్లు (ఎక్స్-షోరూమ్)
  • ఎక్స్‌టెండెడ్ వేరియంట్ ధర: రూ.10.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)
  • బ్లాక్ బ్యాడ్జ్ వేరియంట్ ధర: రూ.10.52 కోట్లు (ఎక్స్-షోరూమ్)

ఇదెక్కడి క్రేజ్ రా మావా!- ఏకంగా 60లక్షల ప్రొడక్షన్- ఇది మామూలు బండి కాదు బాబోయ్!

ఆకాశంలో అద్భుతం.. మీరు ఎప్పుడైనా 'బ్లాక్​ మూన్' చూశారా?- ఇప్పుడు మిస్సైతే మళ్లీ ఎప్పటికో..!

లావా vs మోటో- ఈ రూ.10వేల లోపు 5G ఫోన్లలో బెస్ట్ ఏది?- ఎందులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.