Lavanya couple hardships about child treatment: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన పెద్ది రాజు.. మల్లాపూర్కు చెందిన గుంటి లావణ్య రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. లావణ్య చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు మరణించారు. అప్పటి నుంచి అమ్మమ్మ, మామయ్యల వద్దే పెరిగింది. ఎన్నో కష్టాలు అనుభవించిన లావణ్యకు పెళ్లి తర్వాత సంతానం కలగడంతో మరో పెద్ద కష్టం ఎదురయ్యింది. ఇటీవల ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఆమె.. అక్కడి సిబ్బంది సలహాల మేరకు కరీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అయితే నెలలు నిండకుండానే కవల పిల్లలు పుట్టడంతో.. బరువు తక్కువగా ఉండటం, అవయవాలు సరిగా ఎదగకపోవడం వల్ల ఆ పిల్లలకి ప్రస్తుతం ఇంక్యూబేటర్లో చికిత్స అందిస్తున్నారు.
ఆ పిల్లల వైద్యం కోసం వారు పడుతున్న బాధలు అన్ని ఇన్నీ కావు. ఇప్పటికే సుమారు 5 లక్షలు ఖర్చయ్యాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల వైద్య కోసం తమకు జీవనోపాధి అయిన 30 గొర్రెలు, 10 గుంటల ఇంటి స్థలాన్ని అమ్మేశామని చిన్నారి తల్లి లావణ్య తెలిపింది . మరో రెండు నెలల పాటు చికిత్స చేస్తేనే ఆ పసి ప్రాణాలు దక్కుతాయని వైద్యులు చెబుతున్నారని ఆమె పేర్కొంది. ఇంటి ఆస్తులు, ఇంట్లో ఉన్న డబ్బంతా పెట్టాక తమ వద్ద ఇంకేమి లేదని.. ఎవరైన దాతలు తమకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని లావణ్య వేడుకుంటోంది.
ఇప్పటికే తమకున్నదంతా అమ్మేసి పిల్లల చికిత్స కోసం ఖర్చు చేసామని మరో 5 లక్షల వరకు ఖర్చవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి 8897147785 నెంబర్కు గూగుల్ పే లేదా ఫోన్ పే కు తోచినంత సహాయం చేసి తమ బిడ్డల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: