ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​ టెస్ట్ ఈవెంట్స్ వాయిదా - Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్స్​ను నెల రోజులు వాయిదా వేశారు నిర్వాహకులు. జపాన్​లో కరోనా వ్యాప్తి కారణంగా విధించిన ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించారు.

Restart date for Tokyo Olympic test events postponed by a month
ఒలింపిక్స్​ టెస్ట్ ఈవెంట్స్ నెలరోజులు వాయిదా
author img

By

Published : Jan 28, 2021, 9:19 PM IST

ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్స్​.. నెల రోజుల పాటు వాయిదాపడ్డాయి. మార్చి 4న ప్రారంభంకావాల్సిన ఈవెంట్​.. ఏప్రిల్ 3కు వాయిదా వేసినట్లు నిర్వాహకులు గురువారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో టోక్యో సహా జపాన్​లోని పలు ప్రాంతాల్లో అత్యయిక స్థితిని విధించడం, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టిస్టిక్ స్విమ్మింగ్​ క్వాలిఫైయర్​ పోటీలు తొలుత మార్చి 4 నుంచి 7 వరకు జరగాల్సి ఉండగా, మే 1 నుంచి 4కు వాయిదాపడ్డాయి. ఒలింపిక్స్, పారాలింపిక్స్​ ఆటల్లోని తొలి 18 ఈవెంట్లు యొయొగి జాతీయ స్టేడియంలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో జరగనున్నాయి. ఫినా డైవింగ్ ప్రపంచ కప్​ను​ ఏప్రిల్ 18 నుంచి 23 వరకు టోక్యో ఆక్వాటిక్స్ సెంటర్​లో నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.