Sam Konstas Boxing Day Test : ఆస్ట్రేలియా అరంగేట్ర ప్లేయర్ సామ్ కాన్‌స్టాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ యంగ్ ప్లేయర్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఏమాత్రం బెరుకు లేకుండా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
బుమ్రా ఓవర్లో సిక్సర్
ముఖ్యంగా వరల్డ్‌క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై విరుచుకుపడ్డాడు. 2021 నుంచి టెస్టుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా, సామ్ కాన్‌స్టాస్ ధాటికి ఈ మ్యాచ్‌లో సమర్పించుకున్నాడు. దాదాపు 4,483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో ఈ సిక్స్ నమోదైంది. అటాకింగ్ గేమ్‌తో బుమ్రాను బ్యాక్ ఫుట్‌లో పెట్టిన సామ్, మిగతా బౌలర్లపై కూడా అదే రీతిలో విరుచుకుపడ్డాడు.
Sam Konstas taps the Australian crest as he makes a remarkable 50 on debut! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/y1tp4rT9qG
— cricket.com.au (@cricketcomau) December 26, 2024
వన్డే తరహాలో బ్యాటింగ్
కాన్‌స్టాస్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అరంగేట్ర టెస్టులోనే 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా అద్భుతమైన బంతికి కాన్‌స్టాస్ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు.
మూడో ప్లేయర్ గా రికార్డు
అయితే కాన్‌స్టాస్ అరంగేట్ర మ్యాచ్‌లోనే పలు రికార్డులను నమోదు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడైన(19 ఏళ్లు ) ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అలాగే అరంగేట్ర మ్యాచ్‌లోని హాఫ్ సెంచరీ మూడో ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 1999లో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 2013లో ఇంగ్లండ్‌పై అగర్ 50 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. తాజాగా టీమ్ఇండియాపై కాన్‌స్టాస్ 52 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.
ఇదిలా ఉండగా, తొలి రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా జట్టు 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు స్కోర్ చేసింది. క్రీజ్‌లో పాట్ కమిన్స్ (8*), స్టీవ్ స్మిత్ (68*) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
కోహ్లీ Vs కాన్‌స్టాస్ - ఐసీసీ రిఫరీ యాక్షన్ తీసుకోవాలి : మాజీ క్రికెటర్లు
ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టులు- సెంచరీలు బాదిన ఇండియన్ ప్లేయర్లు వీళ్లే!