ETV Bharat / technology

'వన్‌ప్లస్ 12' స్మార్ట్​ఫోన్​పై భారీ డిస్కౌంట్- ఏకంగా రూ.7,000 వరకు తగ్గింపు!- ఎక్కడంటే? - ONEPLUS 12 PRICE DROP IN INDIA

త్వరలో మార్కెట్లోకి 'వన్‌ప్లస్ 13' సిరీస్ ఎంట్రీ- 'వన్‌ప్లస్ 12'పై భారీ ఆఫర్!

Oneplus 12 Price Drop in India
Oneplus 12 Price Drop in India (Photo Credit- Oneplus)
author img

By ETV Bharat Tech Team

Published : 14 hours ago

Oneplus 12 Price Drop in India: మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి 'వన్​ప్లస్​ 13' సిరీస్​ ఎంట్రీ ఇవ్వనుంది. వచ్చే రెండు వారాల్లో దీన్ని దేశీయ మార్కెట్లో రిలీజ్ చేసేందుకు కంపెనీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తన ప్రీవియస్ వెర్షన్ 'వన్​ప్లస్​ 12' స్మార్ట్​ఫోన్ ధరను తగ్గించింది. దీనిపై ఏకంగా రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు డిస్కౌంట్​ను అందిస్తుంది.

వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ ఫీచర్లు:

  • డిస్‌ప్లే: 6.82 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ + ఎల్‌టీపీఓ 4.0 అమోలెడ్‌
  • పీక్‌ బ్రైట్​నెస్: 4,500
  • రీఫ్రెష్‌ రేట్‌: 120Hz
  • ప్రాసెసర్​: క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3
  • బ్యాటరీ: 5,400mAh
  • మెయిన్ కెమెరా: 50MP
  • అల్ట్రావైడ్‌ యాంగిల్‌: 48MP
  • పెరిస్కోప్‌ టెలిఫొటో జూమ్‌ లెన్స్‌: 64 MP
  • సెల్ఫీ కెమెరా: 32MP
  • 100W సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌

ఆఫర్లు ఇవే: వన్‌ప్లస్ 12 స్మార్ట్​ఫోన్ 12GB + 128GB బేస్‌ వేరియంట్‌ ధర రూ.64,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం అమెజాన్‌ ఈ మొబైల్‌పై 8 శాతం రాయితీ అందిస్తోంది. అంటే రూ.5 వేలు తగ్గింపుతో రూ.59,999కే విక్రయిస్తోంది. దీంతోపాటు ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, వన్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే ఏకంగా రూ.7 వేలు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా EMI ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకున్నవారికి కూడా ఇదే వెసులుబాటు కల్పిస్తోంది. ప్రస్తుతం అమెజాన్​లో ఈ మొబైల్​పై 3, 6, 9 నెలల పాటు EMI ఆప్షన్లు ఎంచుకొనే వెసులుబాటు ఉంది. ఇలా అమెజాన్‌ ఇస్తున్న అన్ని ఆఫర్లు కలుపుకుంటే 'వన్‌ప్లస్‌ 12' స్మార్ట్​ఫోన్​ను కేవలం రూ.52,999కే కొనుగోలు చేయొచ్చు.

ఇకపోతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'వన్​ప్లస్​ 13' సిరీస్ లాంఛ్ డేట్ లీక్ అయింది. త్వరలో కంపెనీ ఈ సిరీస్​లో రెండు మొబైల్స్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ రెండు మోడల్ ఫోన్లను తన వింటర్ లాంఛ్ ఈవెంట్​లో ప్రదర్శించనున్నట్లు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తనసోషల్​మీడియా ప్లాట్​ఫారమ్​లో చేసిన పోస్ట్​లో పేర్కొన్నారు. వన్​ప్లస్​ ఈ సిరీస్​ను భారత మార్కెట్లో జనవరి 7, 2025 న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

కంపెనీ ఇప్పటికే ఈ సిరీస్​ను చైనా మార్కెట్​లో ప్రారంభించింది. ఇప్పుడు వీటిని ఇండియన్ మార్కెట్లోకి కూడా తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఈ సిరీస్​లో 'వన్​ప్లస్​ 13', 'వన్​ప్లస్​ 13R' అనే రెండు మోడల్స్​ రానున్నట్లు తెలుస్తోంది.

'వన్​ప్లస్​ 13' ఫీచర్లు:

  • డిస్​ప్లే: ఈ అప్​కమింగ్ మొబైల్​ 6.82 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది వన్​ప్లస్​ 12 మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ కొత్త 'వన్​ప్లస్​ 13' మొబైల్​ డిస్​ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, QHD+ రిజల్యూషన్‌తో వస్తుంది.
  • ప్రాసెసర్: ఇది క్వాల్​కామ్ లేటెస్ట్ స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్​తో రానుంది. ఈ స్మార్ట్​ఫోన్ ఆండ్రాయిడ్ 15 OxygenOS 15తో సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రస్తుతం దీని సాఫ్ట్​వేర్​ను కన్ఫార్మ్ చేయలేదు. అయితే దీని పాత మోడల్స్​ మాదిరిగానే ఈ ఫోన్​ నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్​డేట్స్, ఐదేళ్ల వరకు సెక్యూరిటీ అప్​డేట్స్​తో రావచ్చు.
  • బ్యాటరీ: 'వన్​ప్లస్​ 13' బిగ్ అప్‌గ్రేడ్ బ్యాటరీతో వస్తుంది. కంపెనీ దీనిలో 6,000mAh బ్యాటరీని అమర్చనుంది. అయితే దీని ప్రీవియస్​ 'వన్​ప్లస్​ 12' మోడల్​లో 5,400mAh బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ సింగిల్​ ఛార్జ్​తో దాదాపు రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: దీని కెమెరా విషయానికి వస్తే.. 'వన్​ప్లస్​ 13' మొబైల్​ 'వన్​ప్లస్​ 12'లో ఉన్న అదే 50-మెగాపిక్సెల్ LYT-808 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. అయితే దాని టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్‌లు 50-మెగాపిక్సెల్‌కి అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఫోన్‌లో హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్, 4K/60fps డాల్బీ విజన్ వీడియో క్యాప్చర్ కూడా ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: వన్​ప్లస్​ 13 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్​తో IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. అంతేకాక ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది తడి చేతులతో కూడా ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
  • ధర: 'వన్​ప్లస్​ 13' ధర గురించి మాట్లాడితే.. కంపెనీ దీన్ని రూ. 70,000 కంటే తక్కువ ధరతో ప్రారంభించొచ్చు. దీని ప్రీవియస్ మోడల్​ 'వన్​ప్లస్​ 12' ఇండియన్ మార్కెట్లో రూ.64,000 ధరతో లాంఛ్ అయింది.

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్​టెల్ సేవలు- ఆందోళనలో వినియోగదారులు!

మంచి ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ కొనాలా?- కిర్రాక్ ఫీచర్లతో 2024లో టాప్ ఇవే!

ఈ న్యూఇయర్​లో మంచి రీఛార్జ్ ప్లాన్​ కోసం చూస్తున్నారా?- రూ.500లోపు బెస్ట్ ప్యాక్స్ ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.