న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్(Ind vs NZ T20 Series 2021)ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదుంది టీమ్ఇండియా. టెస్టు సిరీస్ ప్రారంభంకావడానికి మరో రెండు రోజుల సమయం ఉండటం వల్ల ఆటగాళ్లు దొరికిన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కివీస్‌తో జరిగిన చివరి టీ20 అనంతరం టీమ్ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. తన మ్యాజిక్‌తో మిగతా ఆటగాళ్లను, సహాయ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకుముందు కార్డ్ ట్రిక్‌తో ఎందరినో బోల్తా కొట్టించిన శ్రేయస్.. ఈసారి పేసర్ మహ్మద్ సిరాజ్‌ను బురిడీ కొట్టించాడు.
ఏమైందంటే?
Shreyas Iyer Magic Video: సిరాజ్‌ను ఓ కార్డు( ఫోర్ ఆఫ్ స్పేడ్స్)ను తీసి అందరికీ చూపించమంటాడు శ్రేయస్. తర్వాత దానిని రెండు చేతుల మధ్య దాచిపెట్టమంటాడు. అనంతరం మరో కార్డు (జోకర్)ను తీసుకొని ఆ చేతులపై తాకుతాడు. ఆ కార్డును సిరాజ్‌కు చూపించగా అది కాస్తా ఫోర్ ఆఫ్ స్పేడ్స్గా మారిపోతుంది. సిరాజ్ తన చేతిలోని కార్డును చూడగా అది జోకర్‌గా మారిపోతుంది. అంతే సిరాజ్‌తో పాటు పక్కనే ఉన్న రుతురాజ్, రాహుల్ ఆశ్చర్యానికి గురవుతారు. ఈ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
-
Weaving some magic 🪄 with a deck of cards & blowing everyone's minds 😯
— BCCI (@BCCI) November 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
How's this card trick from @ShreyasIyer15 that got @mdsirajofficial stunned! 😎#TeamIndia #INDvNZ pic.twitter.com/kKLongQ0CJ
">Weaving some magic 🪄 with a deck of cards & blowing everyone's minds 😯
— BCCI (@BCCI) November 22, 2021
How's this card trick from @ShreyasIyer15 that got @mdsirajofficial stunned! 😎#TeamIndia #INDvNZ pic.twitter.com/kKLongQ0CJWeaving some magic 🪄 with a deck of cards & blowing everyone's minds 😯
— BCCI (@BCCI) November 22, 2021
How's this card trick from @ShreyasIyer15 that got @mdsirajofficial stunned! 😎#TeamIndia #INDvNZ pic.twitter.com/kKLongQ0CJ
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మిడిలార్డర్ బాధ్యతను తీసుకుని పర్వాలేదనిపించాడు శ్రేయస్. రెండు ఇన్నింగ్స్‌ల్లో 30 పరుగులు చేశాడు. అలాగే, ఇదే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గాయపడిన సిరాజ్.. మిగతా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇతడి స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చి మంచి ప్రదర్శన కనబర్చాడు.