'ఆసీస్ పర్యటనకు జంబో జట్టు మంచి ఆలోచనే' - india test series latest news
ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ఇండియా నుంచి 26 మందితో కూడిన జట్టును పంపించడం ఉత్తమమని మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ఇటీవలే వెస్టిండీస్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్లు ఇంగ్లాండ్ పర్యటన కోసం ఈ తరహా పద్దతినే పాటించాయని పేర్కొన్నారు.

కరోనాతో విధించిన లాక్డౌన్ అనంతరం.. టీమ్ఇండియా తొలిసారి టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి. ఈ క్రమంలోనే భారత్ నుంచి భారీ బృందాన్ని పంపాలని ఆస్ట్రేలియా బీసీసీఐని కోరే అవకాశం ఉందని మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే వెస్టిండీస్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు ఇంగ్లాండ్ పర్యటన కోసం ఈ తరహా పద్దతినే పాటించాయని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలోనే పర్యటన కోసం టీమ్ఇండియా నుంచి కనీసం 26 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా పంపించడం మంచిదని తెలిపాడు ఎమ్మెస్కే. భారత జట్టుతో పాటు ఇండియా ఏ జట్టును ఒకే చోట ఉంచడం ఉత్తమమని భావించాడు.
"టీమ్ఇండియాలోకి రావాలనుకుంటున్న యువ క్రికెటర్ల ఆటతీరును పరిశీలించడానికి జట్టు మేనేజ్మెంటుకు, సీనియర్లకు ఇదొక మంచి అవకాశం. ఇది ఏ ఆటగాడి ప్రదర్శన మెరుగ్గా ఉందో, ఎలా జట్టుకు సాయపడతారో పరిశీలించేందుకు సాయపడుతుంది."
-ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్
ఈ 26 మంది బృందాన్ని రెండు గ్రూపులుగా విభించవచ్చని.. తద్వారా క్వారంటైన్ సమయంలో ప్రాక్టీస్ నిర్వహించొచ్చని అభిప్రాయపడ్డాడు ప్రసాద్. "నెట్ బౌలర్లు కరోనా బారిన పడరని మనం విశ్వసించలేం. కాబట్టి, పెద్ద బృందంతో వెళ్లడం చాలా మంచిది. ఎందుకంటే ఆటగాళ్లు బయో సెక్యూర్ వాతావరణంలో ఉంటారు కాబట్టి.. వారి భద్రతపై కాస్త భరోసా ఉంటుంది." అని పేర్కొన్నాడు.
ఒకవేళ సెలెక్టర్‌గా అవకాశమిచ్చి జట్టులో ఎవరెవరిని ఎంచుకుంటారని అడగ్గా.. టెస్టు, వన్డే, టీ20 స్పెషలిస్టుల కలయికతో ఈ క్రింది ఆటగాళ్లకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించాడు.
ఎవరెవరంటే..
ఓపెనర్లు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్
మిడిల్ ఆర్టర్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రెహానే, చెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్,
వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహ
స్పిన్నర్స్: రవిచంద్రన్ అశ్విన్, రవింద్ర జడేజా, షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్
ఆల్ రౌండర్: హార్దిక్ పాండ్యా
పేసర్లు: ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, షార్దుల్ ఠాకుర్
టెస్టు సిరీస్: దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, కృనాల్ పాండ్య