ETV Bharat / entertainment

'జాన్వీ.. విజయ్‌ దేవరకొండను ఇష్టపడుతున్నావా?' - janhvi kapoor crush on vijay deverakonda

విజయ్‌ దేవరకొండ స్థాయి సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. విజయ్​కు బాలీవుడ్​లో కూడా మంచి ఫాలోయింగ్​ ఉంది. తాజా ఇద్దరు టాప్​ బాలీవుడ్​ బ్యూటీలు విజయ్​పై తమకున్న క్రష్​ను బయటపెట్టారు.

Koffee With Karan 7: Sara Ali Khan shares crush with Janvhi Kapoor? Know who is the handsome guy
'జాన్వీ.. విజయ్‌ దేవరకొండను ఇష్టపడుతున్నావా?'
author img

By

Published : Jul 13, 2022, 6:01 AM IST

విజయ్‌ దేవరకొండపై తమకున్న క్రష్‌ను బయటపెట్టారు బాలీవుడ్‌ హీరోయిన్లు సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌. 'కాఫీ విత్‌ కరణ్‌-7' కార్యక్రమానికి అతిథులుగా ఈ ఇద్దరు విచ్చేసి అలరించారు. ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన ప్రోమోను హోస్ట్‌ కరణ్‌ జోహర్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులోనే 'ఎవరితోనైనా డేట్‌ చేయాలనుందా? ఒకరి పేరు' చెప్పు అంటూ సారాని కరణ్‌ ప్రశ్నించగా విజయ్‌ దేవరకొండ అని సమాధానమిచ్చారామె. 'నువ్వూ విజయ్‌తోనేనా' అని కరణ్‌.. జాన్వీని అడగ్గా ఆమె నవ్వుతోనే సమాధానమిచ్చింది. దాంతో.. 'నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా?' అని జాన్వీని సారా కాస్త గట్టిగానే అడిగారు. వీరే కాదు చాలామంది కథానాయికలు విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. 'అర్జున్‌ రెడ్డి'తో తన స్థాయిని పెంచుకున్న విజయ్‌ 'లైగర్‌'తో నేరుగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'కాఫీ విత్ కరణ్‌' అనేది సెలబ్రిటీల చిట్‌చాట్‌ షో. బుల్లితెరపై 6 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 7వ సీజన్‌ ఓటీటీ 'డిస్నీ+ హాట్‌స్టార్‌' వేదికగా అలరిస్తోంది. ఈ సీజన్‌కు తొలి అతిథులుగా రణ్‌వీర్‌సింగ్‌, అలియా భట్‌ పాల్గొని ఆకట్టుకున్నారు. రెండో ఎపిసోడ్‌కి జాన్వీ, సారా వెళ్లారు. గత సీజన్లలో బాలీవుడ్‌ తారలకే పరిమితమైన ఈ కార్యక్రమంలో ఇప్పుడు దక్షిణాది తారలూ మెరవనున్నారు. ఈ వరుసలో విజయ్‌ దేవరకొండతోపాటు సమంత ఉన్నారు.

ఇదీ చదవండి: నాగచైతన్య 'థ్యాంక్‌ యూ' ట్రైలర్ రిలీజ్​.. నయనతార 75వ చిత్రం ఖరారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.