వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..! - ts rtc strike breaking
వేతన చట్టం ప్రకారం... కార్మికుల వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని హైకోర్టుకు అదనపు ఏజీ తెలిపారు. ఒక్కరోజు గైర్హాజరుకు 8 రోజుల వేతనం మినహాయించే అధికారం ఉందని పేర్కొన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. చేసిన పనికి వెంటనే జీతం ఇప్పించాలని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
![వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..! payment-of-wages-is-illegal-pay-immediately](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5194284-576-5194284-1574855791681.jpg?imwidth=3840)
ఆర్టీసీ కార్మికుల వేతనాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వేతన చట్టం ప్రకారం... కార్మికుల వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని కోర్టుకు అదనపు ఏజీ తెలిపారు. ఒక్కరోజు గైర్హాజరుకు ఎనిమిది రోజుల వేతనం మినహాయించే అధికారం ఉందని పేర్కొన్నారు.
డిసెంబరు 4కు వాయిదా..!
మరోవైపు పనిచేసిన సెప్టెంబర్ నెల వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. చేసిన పనికి జీతం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వేతనాలపై కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలని.. హైకోర్టుకు కాదని అదనపు ఏజీ సూచించారు. డిసెంబరు 4న తదుపరి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చూడండి: వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉంది: అదనపు ఏజీ