ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @1PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 19, 2022, 1:02 PM IST

  • చిన్నారిపై అత్యాచారం కేసు.. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు

ACP On Banjarahills Girl Rape Case: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని ఏసీపీ సుదర్శన్ తెలిపారు. బాధిత బాలికను భరోసా కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు.

  • సుఖేశ్‌ గుప్తాను వైద్య పరీక్షలకు తరలింపు..

మనీలాండరింగ్​ కేసులో అరెస్ట్​ అయిన ఎంబీఎస్​ జువెల్లర్స్ డైరెక్టర్​ సుఖేశ్​ గుప్తాను ఈడీ అధికారులు సీసీఎస్​ నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.​

  • పోలీస్​స్టేషన్​లలో ఆ టెక్నాలజీ ఉపయోగించాలి: మంత్రి కేటీఆర్

KTR on Block Chain Technology: పోలీస్​స్టేషన్​లో జవాబుదారీతనం ఉండేందుకు బ్లాక్​ చెయిన్​ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు బ్లాక్ ​చెయిన్​ టెక్నాలజీ ఉపయోగించిన మొదటి పోలీస్​స్టేషన్​గా ఫిరోజాబాద్​ నిలించిందన్న ఆయన.. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని స్టేషన్​ల​లో ఈ టెక్నాలజీ ఉపయోగించాలని సూచించారు.

  • శరవేగంగా సాగుతున్న కాకతీయ మెగా జౌళి పార్కు పనులు..

Kakatiya Mega Textile Park: వరంగల్ కాకతీయ మెగా జౌళిపార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ అందించేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం పార్కు పరిధిలో కొత్తగా సబ్​స్టేషన్ నిర్మించనున్నారు. కొత్త సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేలోగా సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి విద్యుత్ ఉన్నతాధికారులు భూమి పూజ చేశారు.

  • 'ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'

Chandrababu: ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడికి పాల్పడి నేటికి ఏడాది గడిచిందని ఆయన గుర్తు చేశారు.

'కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు... ఆ ఓట్లను పరిగణించొద్దు'

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​లో పోలైన ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్​ మధుసూదన మిస్త్రీకు ఆయన తరఫు ఎన్నికల ఏజెంట్​ లేఖ రాశారు.

  • 'కశ్మీర్ దేశస్థులను ఏమని పిలుస్తారు?'.. ఏడో తరగతి ప్రశ్నాపత్రంపై దుమారం

కశ్మీర్​ మన దేశంలో భాగం కాదన్నట్లు ఓ పరీక్షలో అడిగిన ప్రశ్న ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి ప్రశ్నలు అడిగింనందుకు ఆ బోర్డుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా వత్తాసు.. భారత్​ ప్రయత్నాలకు అడ్డు

లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్‌ మహమూద్‌కు ఐరాసలో చైనా అండదండలు లభిస్తున్నాయి. అతడిపై భారత్‌, అమెరికా ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా నిలిపివేసింది.

  • దుమారం రేపిన జైషా వ్యాఖ్యలు.. బెదిరింపులకు దిగిన పాకిస్థాన్

మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జైషా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఘాటుగా స్పందించింది. భారత్​లో జరిగే వన్డే ప్రపంచకప్​కు హాజరుకాకూడదనే ప్రతిపాదనను పాక్ బోర్డు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

  • 'ఆర్యన్​ ఖాన్​ను కావాలనే టార్గెట్​ చేశారు.. దర్యాప్తులో అనేక లోపాలు'

ప్రముఖ బాలీవుడ్​ నటుడు షారుక్​ ఖాన్ తనయుడు ఆర్యన్​ నిందితుడిగా ఉన్న క్రూజ్​ డ్రగ్స్​ కేసులో విజిలెన్స్​ అధికారులు రిపోర్టు సమర్పించారు. కావాలనే ఆర్యన్​ ఖాన్​ను టార్గెట్​ చేశారని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.