Chandrababu: ఆంధ్రప్రదేశ్లో తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడికి పాల్పడి నేటికి ఏడాది పూర్తైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో జగన్ సర్కార్ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలను ధ్వంసం చేసి, చట్టాలను అతిక్రమించి సాగుతున్న ప్రజా వ్యతిరేక, విధ్వంసక పాలనపై పోరాటానికి అందరు సిద్దంకావాలన్నారు.
"తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడికి పాల్పడి నేటికీ ఏడాది. వైకాపా దాడి విషయంలో ఇప్పటికీ జగన్ సర్కార్ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి. వ్యవస్థలను ధ్వంసం చేసి, చట్టాలను అతిక్రమించి పాలన సాగుతోంది. ప్రజా వ్యతిరేక, విధ్వంసక పాలనపై పోరాటానికి పిలుపు." -చంద్రబాబు
ఇవీ చదవండి: శరవేగంగా సాగుతున్న కాకతీయ మెగా జౌళి పార్కు పనులు..
'అప్పట్లో పావురాలు వదిలేవారు.. ఇప్పుడు చీతాలను వదులుతున్నాం'