U19 Womens World Cup BCCI : మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులతో పాటు సహాయ సిబ్బందికి కలిపి రూ.5 కోట్లు అందజేయనున్నట్లు వెల్లడించింది. అండర్-19 మహిళల ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు తెలిపింది. మలేషియాలో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది.
BCCI extends congratulations to the India Under-19 women’s team for successfully defending their title at the ICC Under-19 Women’s T20 World Cup 2025 in Malaysia. BCCI has announced a cash reward of Rs 5 Crore for the victorious squad and support staff, led by Head Coach Nooshin… pic.twitter.com/dv6VXSEM4I
— ANI (@ANI) February 2, 2025
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23 పరుగులు)టాప్ స్కోరర్. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. టీమ్ఇండియా బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ దక్కించుకున్నారు. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమ్ఇండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష (44 పరుగులు; 33 బంతుల్లో: 8x4) స్వల్ప ఛేదనలో అదరగొట్టింది. సనికె చక్లె (26 పరుగులు) రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రెనెకె 1 వికెట్ దక్కించుకుంది. ఇక ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్ నెగ్గింది.
అదరగొట్టిన తెలుగమ్మాయి
ఈ టోర్నీలో తెలుగమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించింది. ఇప్పటికే టోర్నీలో సెంచరీ బాదేసింది. ఫైనల్లోనూ మూడు వికెట్లతో రాణించింది. అటు ఛేదనను కూడా దూకుడుగా ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో పరుగులు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష టోర్నీ ఆసాంతం బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటింది.
తుది జట్టు
భారత్: కమలిని (వికెట్ కీపర్), గొంగడి త్రిష, సనికా చల్కే, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఐష్వరి, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత వీజే, షబ్నమ్ షకిల్, పరుణిక సిసోదియా, వైష్ణవి శర్మ
దక్షిణాఫ్రికా: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డైరా రమ్లాకన్, ఫే కౌలింగ్, కౌలా రేనెకె (కెప్టెన్), కరాబో మెసో (వికెట్ కీపర్), మీకే వాన్ వూరస్ట్, సెష్నీ నాయుడు, ఆష్లే వాన్ విక్, మోనాలిసా లెగోడి, నిని