Ind vs Eng 2nd ODI : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను ఘన విజయంతో ప్రారంభించిన టీమ్‌ఇండియా, రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో గెలిచి, చివరి వన్డేతో సంబంధం లేకుండా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
స్టార్ క్రికెటర్ అరంగేట్రం
ఇక టీ20 సిరీస్‌లో తన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టిన యంగ్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అతడికి జడేజా క్యాప్ అందించాడు. 4ఏళ్ల కిందటే టీ20ల్లో అరంగేట్రం చేసిన వరుణ్‌కు ఎట్టకేలకు ఈ సారి వన్డే జట్టులోనూ ఛాన్స్ లభించింది. దీంతో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన రెండో అత్యధిక వయస్కుడిగా నిలిచాడు. ప్రస్తుతం వరుణ్ వయసు 33 సంవత్సరాల 164 రోజులు.
అయితే ఈ జాబితాలో ఫారుక్ ఇంజినీర్ తొలి స్థానంలో ఉన్నాడు. అతడు 36 సంవత్సరాల 138 రోజులకు భారత్ తరఫున 1974లో వన్డే అరంగేట్రం చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌కు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు.
Debut 🧢 ✅
— BCCI (@BCCI) February 9, 2025
Varun Chakaravarthy will make his first appearance for #TeamIndia in an ODI ✨
Updates ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/TRah0L7gh9
తుది జట్లు
- భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
- ఇంగ్లాండ్ : ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్
ఒక్క 50 పరుగులు చేస్తే రోహిత్ ఖాతాలో ఆ అరుదైన రికార్డు
ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తాజాగా మరో రికార్డుకు చేరువయ్యాడు. మరో 50 పరుగులు చేస్తే సచిన్ తెందూల్కర్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో భారత ఓపెనర్‌గా చరిత్రకెక్కుతాడు. అయితే ఇప్పటికే ఈ లిస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ (16,119 పరుగులు, 332 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో సచిన్ (15,335 రన్స్, 346 మ్యాచ్‌లు) ఉన్నాడు. ఇప్పటివరకు రోహిత్ 342 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 45.22 సగటుతో 15,285 పరుగులు స్కోర్ చేశాడు.
వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌కు బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్ - వెరీ కాస్ట్లీ గురూ!
సినిమా చూస్తుంటే కెప్టెన్ కాల్ వచ్చింది - లేకుంటే ఆ పని చేసుండేవాడిని : శ్రేయస్ అయ్యర్