Horoscope Today February 10th 2025 : 2025 ఫిబ్రవరి 10వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
![](https://assets.eenadu.net/article_img/1mesham_44.jpg)
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో పనిచేస్తే వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాన్ని అందుకుంటారు. సన్నిహితులతో, స్నేహితులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశ్చర్యకరమైన కానుకలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/2vrushabham_45.jpg)
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కృషి, పట్టుదలతో చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సృజనాత్మకమైన ధోరణితో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
![](https://assets.eenadu.net/article_img/3mithunam_42.jpg)
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఇబ్బంది పెట్టిన క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. డబ్బుకు లోటుండదు. వ్యాపారంలో తెలివిగా పెట్టుబడి పెడితే మంచి లాభాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/4karkatakam_39.jpg)
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. మనోధైర్యంతో ఓ కీలక విషయంలో ముందంజ వేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి. తెలివిగా ఖర్చుచేయండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
![](https://assets.eenadu.net/article_img/5simham_41.jpg)
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా వృత్తి పరమైన, వ్యక్తిగతమైన శుభవార్తలతో నిండి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల ఆనందంగా ఉంటారు. స్థిరమైన ఆదాయం, ఇతర ఆర్థిక వనరుల పెరుగుదలకు అవకాశం ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/6kanya_44.jpg)
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహాలంకరణ కోసం అధిక ధనవ్యయం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/7tula_41.jpg)
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో క్లిష్టమైన పరిస్థితుల కారణంగా ఆందోళనతో ఉంటారు. కుటుంబ సభ్యులతో విబేధాలు వచ్చే అవకాశం. బంధువుల పరివర్తన మనస్థాపం కలిగిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
![](https://assets.eenadu.net/article_img/8vrutchikam_42.jpg)
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ కోసం మీరు పనిచేయడం ఈ రోజు చాలా ముఖ్యం. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/9danassu_40.jpg)
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం పాటించడం చాలా ముఖ్యం. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/10makaram_43.jpg)
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/11kumbam_43.jpg)
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. పనిపట్ల మీరు చూపే శ్రద్ధ మీకు ప్రశంసలు తెచ్చి పెడుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. ఆర్థికంగా శుభ సమయం. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/12meenam_44.jpg)
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. సంపూర్ణ మనోబలంతో అఖండ విజయాలు సాధిస్తారు. ఉత్సాహం, శక్తి నిండిన మనసుతో అద్భుతాలు సృష్టిస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.