Fire Accident at Old City : హైదరాబాద్ పాతబస్తీలోని అబ్బాస్ టవర్స్‌లోని వస్త్రాలు విక్రయించే నాలుగు అంతస్తుల కాంప్లెక్స్‌లో తెల్లవారుజామున 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని వస్త్రాలు నిల్వ ఉంచిన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నాలుగో, మూడో అంతస్తులకు మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు అంచన వేశారు. మూడో అంతస్తులో ఉన్న వస్త్ర దుకాణాల్లో కూడా మంటలు చెలరేగాయి. మూడు, నాలుగో అంతస్తులో మంటలు అంటుకోవడంతో అక్కడ ఉన్న దుకాణాల్లోని నిల్వ చేసిన వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికంగా నివాసంచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చార్మినార్ సమీపంలో అబ్బాస్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారని తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ నారాయణరావు అన్నారు. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లో డబుల్ సెల్లర్, జీ ప్లస్ 3 అంతస్తుల భవనం ఉందని తెలిపారు. భవనం చివరిగా ఉండే నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించామని అయన వివరించారు. అర్ధరాత్రి కావడంతో వస్త్ర దుకాణాలు అన్ని మూసి ఉంచారు. అగ్నిమాపక సిబ్బంది దుకాణాలను ఓపెన్ చేసి మంటలను ఇతర దుకాణాలలోకి వెళ్లకుండా మంటలను అదుపులోకి తెచ్చామన్నారు.
భవనంపై నివాసం ఉన్న వాచ్‌మెన్ కుటుంబాన్ని కాపాడి : భవనంపైన వాచ్‌మెన్ కుటుంబ సభ్యులను రెస్క్యూ చేసి కాపాడామని తెలియజేశారు. అబ్బాస్ కాంప్లెక్స్ పక్కనే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో 15 మందిని సైతం పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చి కిందకు తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోందన్నారు. పాత భవనం కావడంతో సేఫ్టీ ప్రికాషన్స్ లేవని గుర్తించామని ఆయన వివరించారు. భవనంలో అమర్చిన విద్యుత్ సిస్టమ్ వైర్లు అన్ని పాతవిగానే ఉన్నట్లు తెలిసిందని మార్చుకోలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా దర్యాప్తులో గుర్తించామని అగ్నిమాపక అధికారులు గుర్తించారు.
చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం - తప్పిన ముప్పు
కొండాపూర్‌లోని మహీంద్ర షోరూంలో అగ్నిప్రమాదం - 14 కార్లు దహనం