Husband Attempts Suicide in Anger at Wife in Secunderabad : భార్యపై కోపంతో భర్త ఆమె పని చేసే వస్త్ర దుకాణంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సికింద్రాబాద్ ప్యాట్నీలో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో మౌనిక అనే మహిళ పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె భర్త శ్రావణ్ అక్కడకు వెళ్లాడు. ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన శ్రావణ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో వినియోగదారులు ఉండగానే ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కాగా గాయపడిన శ్రావణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రుణం ఇప్పిస్తానని ఇల్లే రాయించుకున్నాడు - బేగంపేటలో వెలుగుచూసిన దళారి మోసం