Oneplus Upcoming Phones: వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో ప్రారంభించి ఈ ఏడాది అనేక స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయబోతోంది. కంపెనీ కొన్ని రోజుల క్రితమే భారత మార్కెట్లో 'వన్‌ప్లస్ 13' సిరీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు 'వన్‌ప్లస్ 13 మినీ', 'వన్‌ప్లస్ ఏస్ 6' సిరీస్, 'వన్‌ప్లస్ 14' వంటి అనేక స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వన్‌ప్లస్ ఈ అప్‌కమింగ్ ఫోన్లపై లీక్స్ వచ్చాయి.
వీటిలో ముందుగా 'వన్‌ప్లస్ 13 మినీ' మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కంపెనీ ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 2025లో ప్రారంభించొచ్చు. ఈ సమాచారాన్ని చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో ద్వారా డిజిటల్ చాట్ స్టేషన్ అందించింది. దీని ప్రకారం ఈ ఫోన్ 'వన్‌ప్లస్ 13 మినీ' లేదా 'వన్‌ప్లస్ 13T' అనే పేరుతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక 'వన్‌ప్లస్ ఏస్ 5' సిరీస్‌లోనూ కంపెనీ రెండు ఫోన్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. వాటి పేర్లు 'వన్‌ప్లస్ ఏస్ 5V', 'వన్‌ప్లస్ ఏస్ 5S'. ఈ రెండు మోడల్స్‌నూ బిగ్ డిస్ప్లేతో తీసుకొస్తుందని సమాచారం. కంపెనీ ఈ 'వన్‌ప్లస్ ఏస్ 5' సిరీస్‌ను ఇటీవలే ప్రారంభించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో రెండు మోడల్స్‌ను విడుదల చేయొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ ఫోన్‌లతో పాటు వన్‌ప్లస్ తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'వన్‌ప్లస్ 14' గురించి కూడా టిప్‌స్టర్ సమాచారం అందించారు. ఈ సమాచారం ప్రకారం 'వన్‌ప్లస్ 13' సక్సెసర్‌గా వస్తున్న 'వన్‌ప్లస్ 14'ను అక్టోబర్ 2025లో చైనాలో ప్రారంభించొచ్చు. ఆ తర్వాత ఇతర గ్లోబల్ మార్కెట్లలో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కొత్త విషయం ఏం కాదు. ప్రతి సంవత్సరం వన్‌ప్లస్ దాని ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్‌ను చైనాలో ముందుగానే అంటే అక్టోబర్-నవంబర్‌లో లాంఛ్ చేస్తుంది. కొన్ని వారాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుంది. కంపెనీ 'వన్‌ప్లస్ 14' సిరీస్ రిలీజ్లో కూడా అదే ప్యాటర్న్‌ను రిపీట్ చేయొచ్చు.
ఇది కాకుండా ఈ ఏడాది చివరిలో కంపెనీ 'వన్‌ప్లస్ ఏస్ 6' సిరీస్‌ని కూడా ప్రారంభించొచ్చు. ఇందులో 'వన్‌ప్లస్ ఏస్ 6', 'ఏస్ 6 ప్రో' అనే రెండు ఫోన్‌లు ఉండొచ్చు. ఈ రెండు మోడల్స్ జనవరి 2025లో ప్రారంభించిన 'వన్‌ప్లస్ ఏస్ 5', 'ఏస్ 5 ప్రో' సక్సెసర్లుగా వస్తున్నాయి. అయితే కంపెనీ ఇటీవలే లాంఛ్ చేసిన ఈ 'వన్‌ప్లస్ ఏస్ 5' సిరీస్‌లో 'ఏస్ 5V', 'ఏస్ 5s' అనే రెండు కొత్త ఫోన్‌లను మే నెలలో విడుదల చేయొచ్చు.
యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్- ఊహించని అప్‌గ్రేడ్స్‌తో చౌకైన ఐఫోన్ వచ్చేస్తోంది!
ఏంటి మామా ఇది నిజమేనా.. 10 నిమిషాల్లోనే కార్ల డెలివరీనా?- జెప్టో క్రేజీ వీడియో చూశారా?