Tirumala Temple To Be Closed Due To Eclipse: 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా.. ఈ మూడు రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను తితిదే రద్దు చేసింది. 25న సూర్యగ్రహణం రోజున ఉదయం 8 నుంచి, రాత్రి ఏడున్నర గంటల వరకు దాదాపు 12 గంటలు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. నవంబరు 8న చంద్రగ్రహణం రోజున ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
అలాగే దీపావళి ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున.. 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. గ్రహణాల రోజుల్లో ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి సర్వదర్శనాల భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: