Champions Trophy Flag Issue : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే పలు కాంట్రవర్సీలు జరగ్గా, ట్రోర్నీ మొదలవ్వకముందే తాజాగా ఓ సంఘటన మరో వివాదానికి దారి తీసింది. ఈ టోర్నీలో పాల్గొననున్న అన్ని దేశాల జాతీయ జెండాలను కరాచీ స్టేడియంలో ప్రదర్శించారు. అయితే అందులో భారత్ జెండా కనిపించకపోవడం వివాదస్పదం అయ్యింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ జెండా మినహా, టోర్నీలో పాల్గొంటున్న మిగిలిన 7 దేశాల జెండాలు అక్కడ ఏర్పాటు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. అన్ని దేశాల జాతీయ జెండాలు ప్రదర్శించాల్సిన చోట భారత పతాకం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీమ్ఇండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలా చేసిందంటూ ఆరోపిస్తున్నారు. 'జెండాకే ఇంత భయపడితే ఎలా?' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
चैंपियंस ट्रॉफी क्रिकेट की मेज़बानी करने जा रहे @TheRealPCB ने कराची स्टेडियम में भारत को छोड़कर इस टूर्नामेंट में भाग लेने वाले सभी देशों के झंडे फहराए हैं। यह भारत का अपमान है। पाकिस्तान क्रिकेट बोर्ड से इस पर जवाब मांगा जाना चाहिए। साथ ही, मैं @BCCI से अनुरोध करूंगा कि वह… pic.twitter.com/PL9fKF44uH
— Gautam Chakrabarty (@GautamChakraba6) February 16, 2025
అందుకేనా
అయితే భద్రతా కారణాల వల్ల ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు భారత్ వెళ్లడం లేదు. పాకిస్థాన్‌కు రావాలని పీసీబీ పలుమార్లు అభ్యర్థించినా బీసీసీఐ వాటిని తిరస్కరించింది. దీంతో టీమ్ఇండియా మ్యాచ్‌లన్నీ తటస్థ వేదిక దుబాయ్‌లో జరగనున్నాయి. భద్రత కారణాలు చూపి టీమ్ఇండియా పాక్‌లో పర్యటించకపోవడం వల్లే, పీబీసీ ఇలా భారత్ జెండా ప్రదర్శించలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, దీనిపై పీసీబీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా, మ్యాచ్ సందర్భంగా టీమ్ఇండియా ఆటహాళ్లను హగ్ చేసుకోవద్దని పాక్ పేయర్లకు అక్కడి ఫ్యాన్స్ ఇటీవల స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. దీనికి సంబంధించిన వీడియోను పాక్ జర్నలిస్ట్ ఒకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మనం అలా చేయాల్సిందే
భారత్ జెండా మినహా, అన్ని దేశాల జెండాలు ప్రదర్శించిన పీసీబీకు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫలితంగా ఆతిథ్య దేశం (పాకిస్థాన్) లోగోను టీమ్ఇండియా జెర్సీపై ఉంచుకోవద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, భారత్- పాకిస్థాన్ ఫిబ్రవరి 23న తలపడనున్నాయి. అసలే ఇండోపాక్ మ్యాచ్ అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది. పైగా ఇలాంటి పరిణామాల మధ్య మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్- ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చా?
ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సెట్! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే