ETV Bharat / city

TDP Strike in AP: మహిళలపై అఘాయిత్యాలపై నిరసనగా 'తెదేపా నారీ సంకల్ప దీక్ష' - TDP Strike Over Attacks on Women

TDP Strike in AP : ఏపీలో.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తెదేపా మహిళా నేతలు గళమెత్తారు. ఆడవారిపై జరుగుతున్న అరాచకలకు వ్యతిరేకంగా తెదేపా నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో.. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతోంది.

TDP Strike in AP
TDP Strike in AP
author img

By

Published : Jan 31, 2022, 11:02 AM IST

TDP Strike in AP : ఏపీలోని.. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో తెదేపా నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగానే దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. రెండున్నరేళ్లలో నిత్యం మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

TDP Strike Over Attacks on Women : మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. మద్యపాన నిషేధమంటూనే.. పెద్దఎత్తున దుకాణాలు తెరిచారని అనిత మండిపడ్డారు. డ్వాక్రా మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్లో ధైర్యం నింపేందుకే సంకల్ప దీక్ష చేపట్టినట్లు ఆమె వివరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.