ఫోన్ ఇవ్వలేదని గొంతు కోసుకున్న బాలుడు - minor suicide attempt news in ananthapuram
పబ్జీ గేమ్ ఆడేందుకు తనకు ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫోన్ ఇవ్వలేదని గొంతు కోసుకున్న బాలుడు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదం జరిగింది. పబ్జీ గేమ్ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబసభ్యులు వెంటనే బాలుణ్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : గోదావరి ఉధ్దృతిపై మంత్రి అత్యవసర సమావేశం