ETV Bharat / city

నీటిపారుదలపై కేసీఆర్‌ సమీక్ష... ఆదివారం మరోసారి భేటీ - telangana varthalu

CM KCR REVIEW: నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Aug 6, 2021, 4:08 PM IST

Updated : Aug 6, 2021, 10:30 PM IST

16:06 August 06

నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

కృష్ణా, గోదావరి నదీయాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా కసరత్తు జరుగుతున్న వేళ నీటిపారుదల శాఖపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు, ఇంజినీర్లతో పాటు అడ్వొకేట్ జనరల్ బీఎస్​ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తదితరులతో సీఎం ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం కృష్ణా, గోదావరి బోర్డులు ఈ నెల తొమ్మిదో తేదీన సమావేశం ఏర్పాటు చేశాయి. అయితే సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ దృష్ట్యా ఆ సమావేశాలకు హాజరవడం వీలుపడదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

ఆదివారం మరోసారి.. 

   ఈ పరిస్థితుల్లో గెజిట్ నోటిఫికేషన్, అమలు కార్యాచరణ, ప్రాజెక్టులు, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, ఇంజినీర్లు, న్యాయవాదులతో చర్చించారు. ఆదివారం మరోమారు సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రానికి నీటి కేటాయింపులు చేశాక బోర్డుల పరిధి ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ కోరుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ విషయమై ఎలా ముందుకెళ్లాలన్న విషయమై సమావేశంలో చర్చించారు. సోమవారం సుప్రీంకోర్టులో, ఎన్జీటీలో ఉన్న కేసుల విచారణ, పాలమూరు- రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టులు పనులు, సంబంధిత అంశాలపై సీఎం సమాలోచనలు చేశారు. 

   ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికే రాష్ట్ర సాగునీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేశారు. కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరీ చేస్తోందని, కేంద్రం కూడా తెలంగాణకు అన్యాయం చేసే దిశగా వెళ్తోందని హాలియా సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇవీ చదవండి

Last Updated : Aug 6, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.