చేతిలో జాతీయ జెండాతో 9కిమీ ఈత, 6600 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ - 6600 feet long Tricolour yatra Tricolour yatra
🎬 Watch Now: Feature Video
Azadi Ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర కోల్హాపుర్లోని శిరోల్ తాలుకాలో కొందరు స్విమ్మర్లు ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. కృష్ణామాయీ జల్తరణ్ మండల్‌కు చెందిన 20 మంది సభ్యులు మిరాజ్‌లోని కృష్ణా- వార్ణా నది సంగమం నుంచి శిరోల్ ఉద్గావ్ వరకు 9 కిలోమీటర్లు చేతిలో జెండా పట్టుకొని నదిలో ఈదుకుంటూ వెళ్లారు. గంటా 10 నిమిషాల్లోనే 9 కి.మీ. ఈదడం విశేషం. హరియాణా ఝజ్జర్‌లో 6600 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో జనం ర్యాలీ నిర్వహించారు.