రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం.. పార్క్ చేసిన చోటే ఇరుక్కున్న బైక్.. చివరకు...
🎬 Watch Now: Feature Video
తమిళనాడు వెల్లూరులో ఓ కాంట్రాక్టర్ బైక్ చక్రాల పైనుంచే రోడ్డు వేశాడు. కలగంబల్‌లో వీధిలో ఉండే శివ అనే వ్యక్తి తన షాపు ఎదుట రాత్రి వేళ బైకును నిలిపి ఉంచాడు. తీరా ఉదయం వచ్చి చూస్తే వీధిలో.. కొత్త సిమెంట్ రోడ్డు కనిపించింది. దానిలో బైక్ టైర్లు కూడా కొంతమేర ఇరుక్కుపోయాయి. టైర్లపై సిమెంట్ మిశ్రమం గట్టిగా పేరుకుపోవడం వల్ల బైక్‌ను బయటకు తీసేందుకు.. శివ చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు కొన్నిగంటల పాటు శ్రమించి వాహనాన్ని బయటకుతీశారు. తమకు సమాచారం ఇస్తే మరో చోట పార్క్ చేసేవారిమని శివ సోదరుడు యువరాజ్ చెప్పాడు. రోడ్డు నిర్మాణం సైతం అధ్వానంగా ఉందని.. ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించాడు.