వరదలో కొట్టుకుపోయిన స్కూల్ బస్.. లైవ్ వీడియో!
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లాలో ఓ స్కూలు బస్సు వరదలో కొట్టుకుపోయింది. టనక్పుర్ సమీపంలోని పూర్ణగిరి రోడ్లో ఈ ఘటన జరిగింది. వంతన పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి మధ్యలో నుంచే వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే.. బస్సు అదుపు తప్పి, కాల్వలోకి పడిపోయింది. ఆ సమయంలో వాహనంలో విద్యార్థులు ఎవరూ లేరు. డ్రైవర్, మరో వ్యక్తి ఉన్నారు. ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.