ETV Bharat / state

వీడియో వైరల్ : బస్సులో సీట్ల కోసం లొల్లి - జుట్లు పట్టుకుని తన్నుకున్న మహిళలు - WOMEN FIGHT FOR SEAT IN TGSRTC BUS

ఆర్టీసీ బస్సులో సీట్​ కోసం ఘర్షణ పడిన మహిళలు - జుట్లు పట్టుకుని చీపుర్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్న వైనం

Women Fight For Seat In TGSRTC Bus
Women Fight For Seat In TGSRTC Bus (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Women Fight For Seat In TGSRTC Bus : ఆర్టీసీ బస్సులో సీట్ కోసం మహిళలు ఘర్షణ పడిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం ప్రయాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం చీపురు కట్టలతో, కర్రలతో దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చివరకు తోటి ప్రయాణికులు కలగజేసుకుని అతి కష్టం మీద వారిని చెదరగొట్టడంతో కథ సుఖాంతమైంది.

ఇదీ జరిగింది : మహబూబ్​నగర్ నుంచి వనపర్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీట్ కోసం బస్సులోనే గొడవపడ్డారు. బస్సు బస్​స్టాప్​ వద్దకు రాగానే అందులో నుంచి దిగిన కొందరు మహిళలు వెంటనే పరస్పరం దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. జుట్లు పట్టుకుని చీపుర్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు కలుగజేసుకుని మహిళలను చెదరగొట్టారు.

ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించగా, కొన్నిసార్లు బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సహనం కోల్పోతున్న మహిళలు పలు సందర్భాల్లో ఘర్షణలకు పాల్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థితివరకు వెళ్తున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును చూసి ప్రయాణికులంతా షాక్​ - ఎందుకంటే?

రోడ్డుపై మొరాయించిన బస్సు - మహాలక్ష్ములకు 'ఫ్రీ' తిప్పలు

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.