ETV Bharat / state

ఆ జిల్లాలో కోతుల నుదుటిపై పచ్చబొట్లు - కారణం తెలిస్తే షాక్​! - TATTOO ON MONKEYS FOREHEAD

నిర్మల్​ జిల్లాలో కోతుల నుదిటిపై పచ్చబొట్లు - కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలో భాగంగా ఈ చర్య

Tattoos on Monkeys Fore Head After Sterilization
Tattoos on Monkeys Fore Head After Sterilization (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Tattoos on Monkeys Fore Head After Sterilization : ఎక్కడైనా జంతువులు పచ్చబొట్టు వేయించుకోవడం చూశారా? అదేంటి ఎక్కడైనా అవి పచ్చబొట్లు వేసుకుంటాయా? వాటికి ఇవన్నీ తెలుసా? అని అనుకుంటున్నారా? కానీ నిజమండి. ఆ ప్రాంతంలో కోతులకు పచ్చబొట్లు ఉంటాయి. అయితే ఆ కోతులకు పచ్చబొట్లు ఎవరు? ఎందుకు వేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి సమీపంలో కోతులు విపరీతంగా ఉంటాయి. వాటి పునరావాసం, పునరుత్పత్తి నిరోధక కేంద్రంలో వానరాల సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తున్నారు. అలా చేసిన వాటికి నుదుటిపై త్రిశూలం ఆకారంలో పచ్చబొట్టు వేస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ల పాటు జీవించే వీటికి ఈ పచ్చబొట్టు జీవిత కాలం ఉంటుందని సారంగాపూర్​ పశు వైద్యుడు శ్రీకర్ రాజు చెప్పారు. శస్త్ర చికిత్సల కోసం తిరిగి వీటిని తీసుకొచ్చినప్పుడు గుర్తు పట్టడానికి సులువుగా ఉంటుందని అలా చేశామని వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,510 కోతులకు పచ్చబొట్టు వేసినట్లు తెలిపారు.

టాటూ వేయించుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.