20వేల అడుగుల ఎత్తులో.. గడ్డకట్టించే చలిలో.. ఐటీబీపీ జవాన్ల యోగా - ఐటీబీపీ హిమాలయాలు
🎬 Watch Now: Feature Video

ITBP Yoga At Himalayas: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు అరుదైన రికార్డు సాధించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో.. 22,850 అడుగుల ఎత్తుపై సుమారు 20 నిమిషాల పాటు ఐటీబీపీ జవాన్లు యోగా సాధన చేశారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత రెండు నెలలుగా.. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, త్రివిధ దళాలు, పారా మిలిటరీ విభాగాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మౌంట్ అబి గామిన్ పర్వతారోహణలో భాగంగా.. హిమవీరులు ఈ రికార్డు సాధించారు. అత్యధిక ఎత్తులో యోగా ప్రాక్టీస్ సెషన్ జరగడం ఇదే తొలిసారి. ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించడానికి.. తాము హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో యోగా చేస్తున్నట్లు ఐటీబీపీ తెలిపింది.