సీతారామం సినిమా స్టోరీకి ఆ ఉత్తరమే ఆధారమట - seetarama movie director
🎬 Watch Now: Feature Video
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా తెలుగులో నటించిన ప్రేమకథా చిత్రం 'సీతా రామం'. ఈ ప్రేమ కథా చిత్రంలో హీరోహీరోయిన్ల నటనకు సినీప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా హిట్ టాక్తో ఈ మూవీ తెలుగురాష్ట్రాల్లో అన్నిచోట్ల మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా యువ కథానాయకుడు తేజ సజ్జ.. సీతారామం హీరోహీరోయిన్లతో పాటు చిత్ర దర్శకుడు హను రాఘవపూడితో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో భాగంగా అసలు సీతారామం కథ ఎలా పుట్టింది? స్క్రిప్ట్ ఎప్పుడు మొదలుపెట్టారు? లవ్ స్టోరీ సినిమాలు మాత్రమే తీయడానికి కారణాలు? వంటి ఆసక్తికర విశేషాలను హను రాఘవపూడి పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..