మాజీ సీఎంకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌పైకి ఏనుగు! - కాన్వాయ్‌పైకి దూసుకొచ్చిన ఏనుగు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కోట్‌ద్వార్-దుగడ్డ రహదారిపై కాన్వాయ్‌లో వెళుతుండగా ఓ ఏనుగు వారికి అడ్డుగా వచ్చింది. అంతేకాకుండా కాన్వాయ్‌లోని వాహనాలకు అతి సమీపంగా వచ్చింది. ఏనుగు రావడం చూసిన భద్రతా సిబ్బంది.. త్రివేంద్ర రావత్‌ను తీసుకొని అక్కడి నుంచి పరుగు తీశారు. అనంతరం ఓ బండరాయిపై ఎక్కి గజరాజుకు దూరంగా ఉన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును దూరంగా తరిమికొట్టారు. ఈ క్రమంలోనే గాల్లోకి కాల్పులు జరిపారు.