'సారూ.. ఈ తిండి ఎలా తినగలం?'.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్!
🎬 Watch Now: Feature Video
"రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న మాకు ఇలాంటి భోజనం పెడతారా? దీన్ని అసలు ఎవరైనా తినగలరా?" అంటూ నడిరోడ్డుపై బోరున విలపించాడు ఓ కానిస్టేబుల్. ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని పోలీస్ మెస్‌లో తమకు అందించే ఆహారం అస్సలు బాగుండడం లేదని, ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టు వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మనోజ్ కుమార్.. ఇలా బుధవారం భోజనం ప్లేటుతో రోడ్డుపైకి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కానిస్టేబుళ్లకు పోషకాహారం కోసం రూ.1875 ఇస్తామన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఏమైందని ప్రశ్నించాడు. ఈ వీడియో వైరల్ కాగా.. సీనియర్ ఎస్పీ ఆశిష్ తివారీ స్పందించారు. దర్యాప్తునకు ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యం, విధులకు గైర్హాజరు సహా మనోజ్‌పై మొత్తం 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటి సంగతి కూడా తేల్చాలని సీఐని ఆదేశించారు.
Last Updated : Aug 11, 2022, 10:58 AM IST