ETV Bharat / offbeat

"రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్" - ఇంట్లో దోశ పెనం మీదనే - మీరే మాస్టర్ చెఫ్! - BUTTER NAAN AT HOME

బటర్​ నాన్​ కోసం రెస్టారెంట్​కి వెళ్లాల్సిన పనిలేదు - ఈ టిప్స్​తో మీరే అదరగొట్టేయండి!

Restaurant Style Butter Naan
Butter Naan Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 5:21 PM IST

Restaurant Style Butter Naan Recipe at Home : ఎక్కువ మంది రెస్టారెంట్స్, హోటల్స్​కి వెళ్లినప్పుడు బటర్​ నాన్​ని ఆర్డర్ చేస్తుంటారు. ఇందులోకి సైడ్​ డిష్​గా ఏదైనా నాన్​వెజ్​ కర్రీని తీసుకుంటుంటారు. అలాకాకుండా ఇంట్లోనే బటర్ నాన్ చేసుకుందామంటే అది కాల్చడానికి తందూర్ కావాలి. అదంతా కాస్త రిస్క్​తో కూడుకున్నదిగా భావిస్తుంటారు చాలా మంది. కానీ, మీకు తెలుసా? ఇంట్లోనే దోశ పెనంపై రెస్టారెంట్ స్టైల్​లో "బటర్​ నాన్​ని" ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా చాలా సాఫ్ట్​గా, రుచికరంగానూ ఉంటాయి. అదెలాగో మీరే చూసేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • ఒకటిన్నర కప్పులు - మైదా
  • అర చెంచా - బేకింగ్ సోడా
  • పావు కప్పు - పెరుగు
  • అర చెంచా - ఉప్పు
  • అర చెంచా - చక్కెర
  • కొద్దిగా - నూనె
  • తగినంత - బటర్

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్ తీసుకొని అందులో మైదా, బేకింగ్ సోడా, పెరుగు, ఉప్పు, చక్కెర వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కాస్త జిగురు, జిగురుగా ఉండేలా పిండిని తడుపుకోవాలి.
  • ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిగా నూనె వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు మరోసారి బాగా వత్తుకోవాలి. పిండిని ఎంత మంచిగా వత్తుకుంటే నాన్స్ అంత సాఫ్ట్​గా వస్తాయని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత వత్తుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక పొడవాటి ప్లేట్ తీసుకొని దానిపై కాస్త పొడి పిండిని చల్లుకోవాలి. తర్వాత పిండి ఉండలను ఆ ప్లేట్​లో ఉంచి చేతితో కొద్దిగా నూనె రాసి డ్రై అయిపోకుండా ఒక తడిగుడ్డ కప్పి అరగంటపాటు అలా వదిలేయాలి. 30 నిమిషాలయ్యాక క్లాత్ తీసి చూస్తే పిండి ఉండలు మంచిగా పొంగినట్లు కనిపిస్తాయి.
  • అనంతరం స్టౌపై దోశ పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటపై కొంచెం పొడి పిండి వేసుకొని ఒక పిండి ఉండను ఉంచి చేతితో వత్తుకుంటూ కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి.
  • ఆపై దాన్ని చేతిలోకి తీసుకొని ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి ఛేంజ్ చేసుకుంటూ, తడుతూ ఉంటే నాన్​ చక్కగా సాగుతుంది. అప్పుడు పర్ఫెక్ట్ నాన్ షేప్ కోసం ఒక ఎడ్జ్ పట్టుకొని చేతితో కొంచెం స్ట్రెచ్ చేసుకుంటే సరిపోతుంది.
  • ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం రాకపోతే అప్పడాల కర్రతో రోల్ చేసుకోవచ్చు. కాకపోతే నాన్ షేప్ రాకపోవచ్చు.
  • ఆవిధంగా నాన్​ని చేసుకున్నాక దాన్ని ఒకవైపు వాటర్​తో తడిచేసుకొని జాగ్రత్తగా హీటెక్కిన దోశ పెనంపై వేసుకోవాలి. ఆపై లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు నాన్​ని కాలనివ్వాలి. అప్పుడు వన్​సైడ్ నాన్​ చక్కగా కాలుతుంది.
  • అలా కాల్చుకున్నాక చేతితో పెనం హ్యాండిల్ పట్టుకొని పెనాన్ని మరో సైడ్​కి తిప్పి పట్టుకొని హై ఫ్లేమ్ మీద నాన్​ని రెండో వైపు మంచిగా కాల్చుకోవాలి.
  • ఆ తర్వాత పాన్​ వైపు నాన్​ గోల్డెన్ కలర్​లోకి కాలిందనుకున్నాక దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని వేడి మీద ఉన్నప్పుడే నాన్ మొత్తం మెల్టెడ్ బటర్​ అప్లై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్" రెడీ!

ఇవీ చదవండి :

చుట్టాలొస్తే "కొబ్బరన్నం కోడికూర" ఇలా చేసి పెట్టండి - బిర్యానీని మించిన టేస్ట్!

ఏ కెఫెకి తీసిపోని చికెన్ కట్లెట్- ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! నెల రోజులు నిల్వ ఉంటుందట!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.