ETV Bharat / technology

అదిరే ఏఐ ఫీచర్లతో గెలాక్సీ S25 అల్ట్రా- ధర కూడా 14వేలు పెరిగిందిగా!- మరి అంత రేటుకు ఇది విలువైనదేనా? - GALAXY S25 ULTRA VS S24 ULTRA

'గెలాక్సీ S25 అల్ట్రా' vs 'గెలాక్సీ S24 అల్ట్రా'- వీటిలో ఏది వాల్యూ ఫర్ మనీ?

Samsung Galaxy S25 Ultra vs Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S25 Ultra vs Samsung Galaxy S24 Ultra (Photo Credit- Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 23, 2025, 5:17 PM IST

Updated : Jan 23, 2025, 5:22 PM IST

'Samsung Galaxy S25 Ultra' vs 'Samsung Galaxy S24 Ultra': స్మార్ట్​ఫోన్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న 'గెలాక్సీ S25' సిరీస్​ను శాంసంగ్ బుధవారం రిలీజ్ చేసింది. ఈ సిరీస్​లో 'గెలాక్సీ S25', 'గెలాక్సీ S25+' మోడల్స్​తో పాటు 'గెలాక్సీ S25 అల్ట్రా' ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్​ను కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ ఫ్లాట్, సన్నని డిజైన్, పవర్​ఫుల్ క్వాల్​కామ్ ప్రాసెసర్​తో పాటు అప్​గ్రేడెడ్ ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.

వీటితో పాటు కంపెనీ దీని ధరను కూడా పాత మోడల్​తో పోలిస్తే కనిష్ఠంగా రూ.8000 నుంచి గరిష్ఠంగా 14,000 వరకు భారీగా పెంచింది. అయితే ఇంత ఎక్కువ ధరకు ఈ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ విలువైనదేనా? పాత మోడల్​ కంటే ఇందులో మెరుగైన ఫీచర్లు ఏంటి? వీటిలో ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలు తెలుసుకునేందుకు దీని డిజైన్, డిస్​ప్లే, చిప్‌సెట్, కెమెరా, బ్యాటరీ వంటి వివిధ అంశాలను దాని ప్రీవియస్ మోడల్​ 'గెలాక్సీ S24 అల్ట్రా'తో కంపారిజన్ మీకోసం.

'గెలాక్సీ S25 అల్ట్రా' vs గెలాక్సీ S24 అల్ట్రా:

వేరియంట్స్: ఈ రెండు స్మార్ట్​ఫోన్లూ మూడు వేరియంట్లతో అందుబాటులో ఉన్నాయి.

  • 12GB RAM + 256GB స్టోరేజ్
  • 12GB RAM + 512GB స్టోరేజ్
  • 12GB RAM + 1TB స్టోరేజ్

ధరల కంపారిజన్:

గెలాక్సీ S25 అల్ట్రా ధర:

12GB RAM + 256GB స్టోరేజ్​తో వేరియంట్ ధర: రూ.1,29,999

12GB RAM + 512GB స్టోరేజ్​తో వేరియంట్ ధర: రూ.1,41,999

12GB RAM + 1TB స్టోరేజ్​తో వేరియంట్ ధర: రూ.1,65,999

గెలాక్సీ S24 అల్ట్రా ధర:

12GB RAM + 256GB స్టోరేజ్​తో వేరియంట్ ధర: రూ.1,21,999

12GB RAM + 512GB స్టోరేజ్​తో వేరియంట్ ధర: రూ.1,31,999

12GB RAM + 1TB స్టోరేజ్​తో వేరియంట్ ధర: రూ.1,51,999

స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:

డిజైన్: శాంసంగ్ 'గెలాక్సీ S25 అల్ట్రా' ఇప్పుడు పాత మోడల్​లోని రెక్టాంగ్యులర్ డిజైన్​కు బదులుగా దాని ఎడ్జెస్​లో కొంచెం వంపుతో వస్తుంది.

ప్రాసెసర్: ఈ కొత్త ఫోన్ 3nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది గెలాక్సీ S24 అల్ట్రాలోని 4nm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ కంటే మంచి పనితీరును అందిస్తుంది.

గెలాక్సీ ఏఐ ఫీచర్లు: 'గెలాక్సీ S24 అల్ట్రా'లో కనిపించే సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఇంటర్‌ప్రెటర్, కాల్ అసిస్ట్, రైటింగ్ అసిస్ట్, ఫొటో అసిస్ట్, డ్రాయింగ్ అసిస్ట్ వంటి AI ఫీచర్లను 'గెలాక్సీ S25 అల్ట్రా' మోడల్​లో మెరుగుపరిచారు. వీటితో పాటు Now Brief, Seamless AI Actions వంటి అదనపు AI ఫీచర్లను కొత్త 'శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా'లోని అన్ని యాప్‌లలో ఇంటిగ్రేట్ చేశారు. ఈ కొత్త ఏఐ ఫీచర్లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించిన One UI 7లో భాగం. ఈ ఫీచర్లు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌తో పాత మోడల్స్​లోకి కూడా రానున్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

కెమెరా సెటప్: 'గెలాక్సీ S24' అల్ట్రాలో ఉన్న 12MP అల్ట్రా-వైడ్ కెమెరాను అప్​గ్రేడ్ చేసి కొత్త 'గెలాక్సీ S25'లో 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్​ను అందించారు. ఇది కాకుండా ఈ రెండు డివైజ్​లలోని ఇతర లెన్స్‌లు అలాగే ఉన్నాయి. వాటిలో 200MP మెయిన్ రియర్ కెమెరా, 50 టెలిఫొటో లెన్స్, మరొక 10MP టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. అంతేకాక ఈ రెండు ఫోన్​లలో ఒకేలా 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: ఈ రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్లూ ఒకే విధమైన 5,000mAh బ్యాటరీ ప్యాక్​ను కలిగి ఉన్నాయి. అయితే 'S25 అల్ట్రా' 31 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక 'S24 అల్ట్రా' 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అంటే ఈ కొత్త ఫోన్ పాత మోడల్​ కంటే ఒక గంట అధికంగా వీడియో ప్లేబ్యాక్ టైమ్​ను అందిస్తుంది.

వెయిట్: శాంసంగ్ 'గెలాక్సీ S25' అల్ట్రా బరువు 218g. ఇక పాత మోడల్​ 'గెలాక్సీ S24' అల్ట్రా వెయిట్ 232g. అంటే ఈ కొత్త ఫోన్ పాత మోడల్​ కంటే 14g తేలిగ్గా ఉంటుంది.

కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ రెండు స్మార్ట్​ఫోన్లను ఏడు వేర్వేరు షేడ్స్​లో తీసుకొచ్చింది. వాటిలో మూడు కలర్స్ ప్రత్యేకంగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో కామన్​గా టైటానియం బ్లాక్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఇవి వేర్వేరు ఫినిషింగ్​తో వస్తాయి.

'గెలాక్సీ S25 అల్ట్రా' టైటానియం సిల్వర్‌బ్లూ, టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం వైట్‌ సిల్వర్‌ కలర్ ఆప్షన్​లలో అందుబాటులో ఉంది.

ఇక 'గెలాక్సీ S24 అల్ట్రా' టైటానియం గ్రే, టైటానియం వైలెట్, టైటానియం బ్లాక్, టైటానియం ఎల్లో కలర్ ఆప్షన్​లలో అందుబాటులో ఉంది.

Samsung.comలో 'S25 అల్ట్రా' మోడల్​లో టైటానియం జెట్‌బ్లాక్, టైటానియం జాడెగ్రీన్, టైటానియం పింక్‌గోల్డ్ ఎక్స్​క్లూజివ్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో 'S24 అల్ట్రా' టైటానియం బ్లూ, టైటానియం గ్రీన్, టైటానియం ఆరెంజ్ రంగులలో వస్తుంది.

యమహాకు పోటీగా హీరో- సేమ్ పవర్, ఫీచర్లతో 'జూమ్ 160' లాంఛ్- అయితే వీటిలో బెస్ట్ ఆప్షన్ ఇదే!

కిర్రాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంఛ్!- ధరలు ఎలా ఉన్నాయంటే?

ఎయిర్​టెల్ యూజర్లకు షాక్- ఆ రీఛార్జి ప్లాన్లలో డేటా తొలగింపు!- కారణం ఇదే!

Last Updated : Jan 23, 2025, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.