రెండు కాలేజీల విద్యార్థుల వీరంగం.. రాళ్లు రువ్వుకుంటూ..! - college students gangs fight
🎬 Watch Now: Feature Video
Students Attacks Each Other: చెన్నైలో రెండు కాలేజీల విద్యార్థులు వీరంగం సృష్టించారు. చెన్నై స్టేట్ కాలేజీ విద్యార్థులు చెన్నై సెంట్రల్ స్టేషన్లో తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలులో గొడవ చేయగా.. సహ ప్రయాణికులు చైన్‌లాగి రైలు ఆపారు. అనంతరం విద్యార్థులను రైలు నుంచి దించేశారు. అదే సమయంలో అరకోణం రైలులో ప్రయాణిస్తున్న పచయప్పన్ కాలేజీ విద్యార్థులు ఆ ఘటనను చూశారు. పచయప్పన్ కాలేజీ విద్యార్థులపై ప్రతీకారంతో చెన్నై స్టేట్ కాలేజీ విద్యార్థులు రాళ్లు రువ్వారు. అరకోణం రైలులో ఉన్న కాలేజీ విద్యార్థులు కూడా ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. 15 మంది విద్యార్థులను అరెస్టు చేశారు.