రాత్రివేళ హెడ్లైట్లు లేకుండానే బస్సు నడిపిన డ్రైవర్.. ప్రయాణికులు హడల్ - Bus Driving Without Headlights
🎬 Watch Now: Feature Video
Bus Driving Without Headlights: దక్షిణ కన్నడ జిల్లాలో ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. హెడ్లైట్లు లేని బస్సును చీకట్లో నడిపాడు. కుక్కే సుబ్రహ్మణ్య ఎక్స్‌ప్రెస్ ఉప్పినంగడి నుంచి రాత్రి 7.15కు బస్సు బయలుదేరింది. బస్సుకు ఉన్న నాలుగు లైట్లు అప్పటికే పాడయ్యాయి. అయినప్పటికీ రాత్రి సమయంలోనూ డ్రైవర్ అలాగే బస్సును నడిపాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓ ప్యాసింజర్ దీనిని వీడియో తీస్తుండగా.. కండక్టర్ అప్రమత్తమై ఓ లైట్‌ను ఫిక్స్ చేయించాడు. డ్రైవర్ తీరుపై ఆగ్రహించిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.