'డెత్ పంచ్'తో కోమాలోకి యువ బాక్సర్.. రెండు రోజులకు మృతి - boxer dies in ring video
🎬 Watch Now: Feature Video
Boxer dies during fight: బాక్సింగ్ మ్యాచ్.. ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. ప్రత్యర్థి విసిరిన పంచ్.. 23 ఏళ్ల నిఖిల్ పాలిట యమపాశమైంది. బెంగళూరు నగరభావి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ మ్యాచ్ ఆడుతుండగా.. నిఖిల్ తలకు తీవ్ర గాయమైంది. అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన నిఖిల్‌కు చికిత్స అందించినా.. ప్రయోజనం లేకుండాపోయింది. రెండు రోజుల తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు. మైసూరులో బుధవారం నిఖిల్ మృతదేహానికి అతడి తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మ్యాచ్ నిర్వహించడం వల్లే ఇలా జరిగిందని ఆర్గనైజర్స్‌పై ఫిర్యాదు చేశారు.
Last Updated : Jul 14, 2022, 3:48 PM IST