నటి సురేఖ వాణి భావోద్వేగం.. భర్తతో గడిపిన చివరి క్షణాలను గుర్తుచేసుకుని.. - నటి సురేఖ వాణి భావోద్వేగం సినిమాలు
🎬 Watch Now: Feature Video
Actress Surekha Emotional about her husband: యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నటి సురేఖ వాణి తెలుగులో తెరకెక్కిన 'భద్ర', 'దుబాయ్ శీను', 'బృందావనం', 'శ్రీమంతుడు', 'బొమ్మరిల్లు' చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటూ కుర్రహీరోయిన్లతో సమానంగా గ్లామర్ మెయిన్‌టెయిన్ చేస్తూ అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. అలానే ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే ఈమె భర్త కొంత కాలం క్రితం అనారోగ్యంతో మరణించారు. అయితే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన భర్తతో గడిపిన చివరి క్షణాలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఆయనకు ఏమైంది? ఆయన బెడ్‌పై ఉన్నప్పుడు తాను పడిన బాధను వివరించారామె. తన భర్త కుటుంబంతో ఉన్న విభేదాలు గురించి చెప్పారు.