వారి కోసం 'శ్రీదేవి సోడా సెంటర్' స్పెషల్ షో - శ్రేదేవి సోడా సెంటర్
🎬 Watch Now: Feature Video

సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన 'శ్రీదేవి సోడా సెంటర్'పై(Sridevi soda centre rating) పలువురు మహిళలు ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో మహిళల కోసం చిత్రబృందం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ షోకు చిత్ర నటీనటులతోపాటు పలు మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక విశ్లేషకులు హాజరై చిత్రాన్ని వీక్షించారు. అనంతరం దర్శకుడు కరుణకుమార్ ఎంచుకున్న ఇతివృత్తం బాగుందని అభినందించారు. నేటి యువత కుల రక్కసిపై గొడ్డలివేటు వేయాలని కోరారు.