YCP Liquor party in Kuppam ఇది కదరా.. బూమ్ బూమ్ పార్టీ అంటే..! కుప్పంలో వైసీపీ మందు పార్టీలో.. కార్యకర్తల చిల్ చిల్ - వైసీపీ మందు పార్టీ చిత్రాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 8:12 PM IST

Updated : Oct 16, 2023, 8:26 PM IST

YCP Liquor party in Kuppam: రాష్ట్రంలో మందుబాబులకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, అంటూ.. ఊరు పేరు లేని మద్యాన్ని అమ్ముతున్న వైసీపీ సర్కార్, తమ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో మాత్రం.. పక్క రాష్ట్రానికి చెందిన మందును పొసి కార్యకర్తలను ఉత్సాహపరిచింది. ఆత్మీయ సమావేశం పేరుతో చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేతలు ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి భారీగా హజరైన నేతలు, కార్యకర్తలు కార్యక్రమం ముగిసే వరకు వేయి కన్నులతో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. మద్యం పార్టీకి అంకురార్పణ చేశారు. ఇంకేముంది.. వైసీపీ నేతలు మందు బాటిల్లను చూపుతూ చిందులేస్తూ.. చేతిలో గ్లాస్​లను పట్టుకున్న వారికి తీర్థం పోస్తూ.. కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 

  ఈ కార్యక్రంలో కర్ణాటక నుంచి తెచ్చిన వేలాది మద్యం బాటిల్లతో ఏరులై పారించారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి పక్కన నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశం జాతరను తలపించింది. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైసీపీ  నేతల్లో గత కొంత కాలంగా అసంతృప్తి నెలకొంది. వారిని బుజ్జగించి తమ దారిలోకి తీసుకు రావాలనే ఆలోచనతో గుడుపల్లె మండలం నలగామపల్లెలో ఆత్మీయ సమావేశం పేరుతో పెద్దఎత్తున మందు పార్టీ ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమావేశానికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ తదితర నేతలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 

Last Updated : Oct 16, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.