How to Remove Hair Dye Stains: అందంగా కనిపించడానికి మనలో చాలా మంది తలకు రంగు వేసుకుంటుంటారు. అయితే, రంగు వేసే క్రమంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. నుదురు, మెడ ప్రాంతాల్లో చర్మంపై తప్పకుండా డై మచ్చలు పడుతుంటాయి. వీటిని ఎంత క్లీన్ చేసినా పోకుండా ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో ఈ మచ్చలను తొలగించేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మచ్చలు ఈజీగా పోతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఫేషియల్స్, స్క్రబ్స్ తయారీలో వాడే బేకింగ్ సోడాతో హెయిర్ డై మచ్చల్ని సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా బేకింగ్ సోడా, డిష్‌వాషింగ్ లిక్విడ్‌లను ఒకే మోతాదులో తీసుకొని మిశ్రమంలా తయారుచేసుకోవాలని అంటున్నారు. ఆ తర్వాత దీన్ని మచ్చలు పడిన చోట అప్లై చేసి చేత్తో లేదంటే కాటన్ ప్యాడ్‌తో నెమ్మదిగా రుద్దాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేస్తే మచ్చ తొలగిపోతుందని పేర్కొన్నారు. 2011లో Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన "Hair Dye Removal Using Natural Ingredients"లోనూ ఈ విషయం తేలింది.
- ఇంకా బేబీ ఆయిల్‌తో పాటు కొన్ని ఎసెన్షియల్ నూనెలు కూడా డై మచ్చను తొలగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కొన్ని చుక్కల ఏదైనా నూనెను తీసుకొని దాన్ని మచ్చలపై అప్లై చేసి చేతి మునివేళ్లతో రుద్దాలని వివరిస్తున్నారు. ఇలా చేసిన కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుందని అంటున్నారు.
- హెయిర్ డై మచ్చలు పడిన చోట వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో రుద్దడం వల్ల అక్కడి మృత చర్మం తొలగిపోయి, మచ్చ పడిన ప్రదేశం తిరిగి కాంతివంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
- నిమ్మకాయతో కూడా ఈ సమస్యకు పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక చిన్న నిమ్మకాయ ముక్కను తీసుకొని మచ్చ పడిన చోట నెమ్మదిగా రుద్దాలట. ఆ తర్వాత కాసేపయ్యాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మచ్చలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.
- ప్రస్తుతం మార్కెట్లో చర్మానికి అంటినా వెంటనే తొలగిపోయే హెయిర్ డైలు కూడా అందుబాటులో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే సాధ్యమైనంతవరకు ఇలాంటి వాటిని ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పగుళ్లు పోయి పాదాలు సాఫ్ట్‌గా కావాలా? ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలంటున్న వైద్యులు
చలికాలంలో ఎన్ని క్రీములు రాసినా ఫలితం లేదా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి!