ETV Bharat / state

మాదాపూర్‌లోని రెస్టారెంట్​లో మంటలు - పరుగులు తీసిన కస్టమర్లు - FIRE ACCIDENT AT MADHAPUR

మాదాపూర్‌లోని కృష్ణాస్‌ కిచెన్‌లో అగ్నిప్రమాదం - భారీగా ఎగసిపడుతున్న మంటలు - మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

Massive Fire Accident At Krishna Kitchen
Massive Fire Accident At Krishna Kitchen (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 18 hours ago

Updated : 16 hours ago

Massive Fire Accident At Krishna Kitchen : మాదాపూర్​ కృష్ణాస్​ కిచెన్​ హోటల్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు. అగ్నిప్రమాదం సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది.

ఒకరు అస్వస్థతకు గురయ్యారు : అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ భోజనానికి వచ్చిన కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. భోజనాన్ని వదిలి బయటకు పరుగులు తీశారు. దీనిపై మాదాపూర్ ఫైర్ ఆఫీసర్ మహ్మద్ అబ్దుల్ ఫజల్ మాట్లాడుతూ 3:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చిందని, వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశామన్నారు. స్వల్ప అగ్ని ప్రమాదం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, పొగ ఎక్కువగా పీల్చడంతో ఒకరు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

మాదాపూర్‌లోని రెస్టారెంట్​లో మంటలు - పరుగులు తీసిన కస్టమర్లు (ETV Bharat)

"మాదాపూర్​ డిమార్ట్​ ఎదురుగా అగ్నిప్రమాదం జరుగుతోందని మాకు కాల్ వచ్చింది. మాకు సమాచారం రాగానే 10 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్నాం. మేము వచ్చేసరికి మండలు ఎగిసిపడుతున్నాయి. నీళ్లు పట్టి వాటిని అదుపులోకి తీసుకొచ్చాం. కొంతమేరకు నష్టం వాటిల్లింది. షార్ట్​ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది." - అబ్దుల్ ఫజల్, అగ్నిమాపకశాఖ అధికారి

షాపింగ్ సెంటర్​లో అగ్ని ప్రమాదం - 500 మూగజీవాలు బలి!

వెహికల్స్​ను ఢీకొన్న కెమికల్స్​ ట్రక్కు- ఏడుగురు సజీవ దహనం- ఐసీయూలో అనేక మంది!

Last Updated : 16 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.